కమర్షియల్ యాడ్స్ లోకి అడుగుపెట్టిన హీరో నితిన్

స్టార్ హీరోలు ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత తమకున్న స్టార్ వేల్యూతో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టి కొన్ని వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రెండు చేతులా సంపాదించుకుంటారు.తక్కువ సమయం, ఎక్కువ ఆదాయం రావడంతో ఇండియాలో జనాలకి ఎక్కువగా ఆకర్షించే సినిమా, క్రికెట్ సెలబ్రెటీలు యాడ్స్ ద్వారా కొన్ని వ్యాపారాలని ప్రమోట్ చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు.

 Nithiin Ad Shoot Pics Goes Viral, Tollywood, Telugu Cinema, South Cinema, Star-TeluguStop.com

తెలుగులో ఎక్కువగా యాడ్స్ చేసే అవకాశం సూపర్ స్టార్ మహేష్ బాబుకి వస్తుంది.యండార్స్మెంట్ ల ద్వారా మహేష్ బాబు కోట్ల రూపాయిలు ఆర్జిస్తున్నారు.

అతనితో ఒప్పందం చేసుకొని తమ ప్రోడక్ట్ ని మార్కెట్ చేసుకోవడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి.అలాగే టాలీవుడ్ లో అల్లు అర్జున్ రామ్ చరణ్, ఎన్ఠీఆర్, రానా, వెంకటేష్, నాగార్జున, అఖిల్, తాజాగా విజయ్ దేవరకొండ కూడా కమర్షియల్ యాడ్స్ లోకి వెళ్లి సెలబ్రెటీ ప్రమోటర్స్ గా మారినవారు.

ఇప్పుడు ఇదే దారిలోకి హీరో నితిన్ కూడా వచ్చి చేరాడు.

ఈ క్రమంలో యూత్ స్టార్ నితిన్ కూడా ఓ బ్రాండ్ యండార్స్మెంట్ కోసం సైన్ చేసారని తెలుస్తోంది.

తాజాగా దీని కోసం హైదరాబాద్ లో జరిపిన ఓ యాడ్ షూట్ లో నితిన్ పాల్గొన్నాడు.నితిన్ కి ఇదే మొదటి కార్పొరేట్ బ్రాండ్ ఎండార్స్మెంట్. కాగా నితిన్ ఈ యాడ్ షూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశాడు.ఇవి కాస్త వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ యూత్ స్టార్ మంచి జోష్ మీద ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube