భారత దేశంలో క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ అనేకమార్లు సామాజిక సేవలో పాల్గొని వార్తల్లో నిలిచారు.ఇదివరకు కూడా ఆయన గ్రామాలను దత్తత తీసుకోవడం, అలాగే కొంతమంది పిల్లలకు స్కాలర్ షిప్ లాంటివి అందించడం ఇతరత్రా సాయం చేశారు.
ఇకపోతే సచిన్ టెండూల్కర్ మరోసారి 560 మంది విద్యార్థులకు సహాయం అందించారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలోని బిల్పాటి, సెవానియా లాంటి గిరిజన జాతులకు చెందిన పాఠశాలల విద్యార్థులకు సరైన విద్య, పౌష్ఠిక ఆహారం లభించక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో సచిన్, ఎన్జీవో పరివార్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు కలిసి వారికి సహాయం అందించడానికి ముందడుగు వేశారు.
తను సొంతంగా నడిపించే ‘ టెండూల్కర్ ఫౌండేషన్ ‘ అనే సంస్థ ద్వారా పిల్లలకు సరైన పోషకాహారం అందించబోతున్నారు.తనకి పిల్లలపై ఉండే ప్రేమతోనే ఈ సహాయం అందించడానికి ముందుకు వచ్చారని ఆయన తెలియజేశారు.
ప్రస్తుతం యూనిసెఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న సచిన్ టెండూల్కర్ చిన్నారుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.ఆయన ఎంతో మంది పేద పిల్లలకు టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం లాంటి సదుపాయాలను ఆయన కలిపిస్తున్నారు.
ఈ మధ్య కాలంలోనే ముంబై నగరంలోని ఎస్ఆర్సిసి పిల్లల ఆసుపత్రి లో కొంత మంది చిన్నారులకు వైద్య సదుపాయం అందించడమే కాకుండా వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు.అంతేకాకుండా సచిన్ ఎంపీ గా ఉన్న సమయంలో ఆయన సహాయ నిధులతో కొన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించారు.
సచిన్ టెండూల్కర్ తన టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సేవలు పెద్ద ఎత్తున్న అందిస్తున్నారు.మొదటి నుండి సచిన్ తన సేవ గుణాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు.