పొట్టి క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సాధించిన ఏకైక వ్యక్తి గా పేరుపొందిన యువరాజ్ సింగ్ నుండి వారి అభిమానులకు ఓ తీపి కబురు.తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను పొందిన యువరాజ్ సింగ్ అతని అనారోగ్యం దృష్ట్యా గత సంవత్సరం టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
దీంతో అతని అభిమానులు మళ్లీ యువరాజ్ సింగ్ ను గ్రౌండ్ లో చూడలేమని బాధపడ్డారు.కానీ, వారందరికీ ఇప్పుడు మరో శుభవార్త.
ఇకపోతే తాజాగా యువరాజ్ సింగ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు గా ఆయన ప్రకటించారు.ఇందుకు సంబంధించి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన పంజాబ్ క్రికెట్ సంఘం కార్యదర్శి పునీత్ బాలి రిక్వెస్ట్ మేరకు తిరిగి ఆడాలని అనుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు.
ఇందుకు సంబంధించి బీసీసీఐ చైర్మన్ సౌరబ్ గంగూలీ కి లేఖ రాశాడని పునీత్ వివరించారు.ముందుగా ఈ విషయంపై బాలి తనని ఆడమని చెప్పినప్పుడు మరోసారి ఆలోచించినట్టు వివరాలు తెలియజేశారు.
ఇందుకోసం తాను నెల రోజుల పాటు అన్ని వైపులా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువరాజ్ సింగ్ తెలియజేశారు.ముందుగా పంజాబ్ రాష్ట్రం తరపున దేశవాళి క్రికెట్ అర్థం అని చెప్పుకొచ్చారు.
అయితే లాక్‌డౌన్ తర్వాత పంజాబ్ యువ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్న సందర్భంగా యువరాజ్ సింగ్ కు మళ్లీ క్రికెట్ ఆట పై మనసు మళ్లింది అని తెలియజేశారు.ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం తరపునుంచి టీ-20 మ్యాచ్లు ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు.ఇక ఈ విషయంపై బీసీసీఐ పాలకవర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో యువరాజ్ సింగ్ ముఖ్య పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఆ తర్వాత 2012 సంవత్సరంలో క్యాన్సర్ కారణంగా తన కెరియర్ తాత్కాలికంగా బ్రేక్ పడగా, మళ్ళీ క్యాన్సర్ నుండి కోలుకొని 2013లో టీమిండియాలో స్థానం సంపాదించాడు.ఇక చివరగా 2019 ప్రపంచ కప్ ముందరగా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
తన 17 సంవత్సరాల సుదీర్ఘ క్రికెట్ కెరియర్ లో యువరాజ్ సింగ్ మొత్తంగా 304 వన్డేలు 40 టెస్టులు ఆడాడు.