భారత దేశ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ద లావా ప్రపంచంలోనే అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను భారత్ లో ఆవిష్కరించనుంది.అంత అద్భుతమైన ఫోన్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండీ.హార్ట్‌రేట్, బీపీ సెన్సార్‌తో పల్స్ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించనున్నారు.ఈ ఫోన్ ద్వారా యూజర్లు తమ గుండె ఆరోగ్యం కేవలం సెకన్లలో తెలుసుకోవచ్చు.
అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్’తో ఫోన్లోనే హార్ట్‌రేట్, బీపీని మానిటర్ చేసే డివైజ్‌లు ఉంటాయి.ఫీచర్ ఫోన్ లో ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఫస్ట్ ఫీచర్ స్మార్ట్ ఫోన్ మన దేశందే అవ్వడం విశేషం.
ఈ ఫోన్ ను ప్రతి ఒక్కరు ఎంతో ఈజీగా ఉపయోగించే సౌకర్యం ఉంది.పల్స్ స్కానర్ పై చేతి వేలిని ఉంచిన వెంటనే హార్ట్‌రేట్, బీపీలను స్క్రీన్ పై డిస్ప్లే చేస్తుంది.
ఆరోగ్య వివరాలను భవిష్యత్తులో అవసరాల కోసం ఫోన్ లో సేవ్ అయ్యి కూడా ఉంటాయి.ఈ డేటాను మెసేజ్ రూపంలో మిగితా స్మార్ట్ ఫోన్లకు కూడా పంపించుకోవచ్చు.
కాగా ఈ స్మార్ట్ ఫోన్ కు 1,800 mAh కెపాసిటీ గల బ్యాటరీ అందుబాటులో ఉంది.ఒక్కసారి ఈ స్మార్ట్ ఫోన్ కు ఛార్జింగ్ పెడితే ఏకంగా ఆరు రోజుల పాటు పని చేస్తుంది.కాగా ఈ లావా పల్స్ స్మార్ట్ ఫోన్ ధర రూ.1,599 గా నిర్ణయించారు.ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రోజ్ గోల్డ్ కలర్లో మాత్రమే అందుబాటులో ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తో పాటు రిటైల్ దుకాణాల్లో కూడా లభించనుంది.