ఏపీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.అక్కడ రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.
ఈ మహమ్మారి సామాన్యు ప్రజల నుండి నుండి ప్రజాపతినిధిలు, సెలెబ్రేటిస్ వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మరి.అక్కడి ప్రభుత్వం ఈ వైరస్ కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.
ఇప్పటికే చాల మంది కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే ఇప్పటి వైసీపీలో చాల మంది నాయకులు ఈ మహమ్మారి బారిన పడ్డారు.
తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు.
దీంతో ఆయన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు.ఈ నిర్దారణ పరీక్షలలో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది.
డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం ఎమ్మెల్యే హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.అంతేకాకుండా ఇటీవల కాలంలో ఎమ్మెల్యేను కలిసిన వారందరిని కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.
ఏపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరారు.మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.