హైదరాబాద్ లో మరో ఏటీఎం చోరీకి యత్నం... కానీ చివరకు...?!

ఓవైపు ప్రపంచం ఆధునిక పోకడలతో దూసుకు వెళుతుంటే మరోవైపు దొంగలు కూడా అదే మాదిరి కొత్త మార్గాలను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు.అసలు విషయంలోకి వెళితే… ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మహా నగరం చుట్టుపక్కల ఏటీఎం దొంగతనాలు తరచుగా సంభవిస్తున్నాయి.

 Atm Rob,hyderabad, Telangana, Police-TeluguStop.com

కొందరు దొంగ ముఠా సభ్యులు హైదరాబాద్ నగర శివార్లలోని ఏటీఎంలను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకోవడానికి యత్నిస్తున్నారు.ఇక ఇదే నేపథ్యంలో తాజాగా బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు మరో చోరీకి ప్రయత్నం జరిగింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే… హైదరాబాద్ నగరంలోని నాచారం ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంక్ ఎటిఎం లో నేడు ఉదయం ఏటీఎంలో చోరీ యత్నం జరిగింది.ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది.

దరిదాపుల్లో జనం లేని సమయం చూసి దుండగులు ఏటీఎంపై దాడి చేశారు.ఏటీఎం పై దాడి చేసే సమయంలో ఏటీఎంలకు సంబంధించిన సెన్సార్ ఆధారంగా ఏటీఎం నిర్వహిస్తున్న వారికి సమాచారం చేరడంతో వారు వెంటనే అప్రమత్తమై పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100 కు సమాచారాన్ని అందించారు.

ఇదిలా ఉండగా ఆ ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు తీయడానికి వీలు పడకపోవడంతో పోలీసులు రాకముందే అక్కడి నుంచి పరారయ్యారు.ఇకపోతే ఈ సంఘటనలో కెనరా బ్యాంకు సంబంధించిన ఏటీఎం పూర్తిగా ధ్వంసం అయింది.

గడిచిన పది రోజుల్లో నగరంలో ఇలాంటి సంఘటన జరగడం మూడోసారి.కాబట్టి హైదరాబాద్ నగర శివారులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు, ఏటీఎం లను నిర్వహించే అధికారులు మరింత కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం తెలియచేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube