ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ.అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఈ ప్రాణాంతక వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.నివారణపైనే అందరూ దృష్టి సారించిరు.
ఇక ఈ కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా శానిటైజర్ల వినియోగం ఓ రేంజ్‌లో పెరిగింది.అసలు శానిటైజర్ అంటే ఏంటో తెలియని వారు కూడా కరోనా నుంచి రక్షించుకునేందుకు తరచూ శానిటైజర్లతో చేతులను క్లీన్ చేసుకుంటున్నారు.
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోనే.శానిటైజర్లు అందరి జీవితంలో ఒక భాగం అయ్యాయి.ఇదిలా ఉంటే.ఏపీలో కొందరు మందుబాబులు మద్యం బదులు శానిటైజర్లు తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇప్పటికే కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.ఇక ఎందుకు వీరు .మద్యం బదులు శానిటైజర్లు తాగుతున్నారని ఆరా తీయగా.ఏపీలో మద్యం ధరలు పెరగడమే ఇందుకు కారణమని అంటున్నారు.
వాస్తవానికి మందుబాబులతో మద్యం మానిపించేందుకు ఏపీ సర్కార్.మద్యం ధరలను దాదాపు డబుల్ చేసి షాక్ ఇచ్చింది.ఇక మద్యం ధరలు పెరిగిపోవడంతో.మందు బాబులు చూపు హ్యాండ్ శానిటైజర్లపై పడింది.
మద్యం కన్నా తక్కువ రేటుకే శానిటైజర్లు లభించడంతో.కొందరు వాటిని కొనుగోలు చేసి తాగేస్తున్నారు.
వాటిని తాగడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నా.ఆ శానిటైజర్లలో ఆల్కహాల్ ఉంటుంది.అది తమకు మాంచి కిక్ ఇస్తుందని చెప్పడం గమనార్హం.ముఖ్యంగా మద్యానికి బానిసలైన పేదలు.
ఆల్కహాల్ శాతం అధికంగా ఉన్న శానిటైజర్‌ను కొనుగోలు చేసి నీళ్లు, కూల్ డ్రింక్స్‌లోకి పోసుకుని తాగుతున్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో.
ఇదెక్కడి గోలరా నాయనా.మద్యం బదులు శానిటైజర్లు తాగడం ఏంటీ అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు.
.