టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో హీరోగా నటించినటువంటి “జానీ” చిత్రానికి తానే దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించగా స్వర్గీయ నటుడు రఘువరన్, బ్రహ్మానందం, స్వర్గీయ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.
అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నటి రేణు దేశాయ్ ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో తనకు మిగిలిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.
ఇందులో భాగంగా తాను ఈ చిత్రం కోసం రోజుకి 15 నుంచి 17 గంటలు కష్టపడి పని చేసానని అయితే ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.అలాగే ఇప్పటికీ ఆ చిత్రంలో పని చేసినటువంటి ఆర్టిస్టులు మరియు నటీనటులతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తో విడిపోయినప్పటినుంచి నటి రేణు దేశాయ్ పూణేలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో పిల్లలతో కలిసి ఉంటున్నట్లు సమాచారం.కాగా ఇటీవలే ఓ ప్రముఖ సినీ నిర్మాత తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించే అవకాశం ఇచ్చినప్పటికీ రేణు దేశాయ్ పలు వ్యక్తిగత కారణాల వల్ల సున్నితంగా తిరస్కరించింది.
కానీ ఆ చిత్ర ప్రమోషన్ వేడుకలకి మాత్రం హాజరయ్యింది.