టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.
కాగా బన్నీ నటించిన ఓ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెడీ అయ్యాడు.ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా ఆయన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన డీజే-దువ్వాడ జగన్నాధం చిత్రం బన్నీ కెరీర్లో హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోగా, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.
దీంతో ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని దిల్ రాజు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమాలో తొలుత హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా పేరు వినిపించింది.
కానీ ఈ సినిమా సబ్జెక్ట్ నచ్చి తాము ఈ సినిమాలో హీరోగా నటిస్తామంటూ టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్‌లు కూడా క్యూ కట్టారట.
దీంతో బాలీవుడ్లో డీజే ఏ హీరో వాయిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
దిల్ రాజు ఈ సినిమాను బీఆర్ చోప్రాతో కలిసి నిర్మిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.మరి ఈ సినిమాను అక్కడ ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు అనే అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది.