షార్క్ చేపలలో నిజానికి చాలా జాతులు ఉన్నాయి.ఇందులో చిన్న సైజు నుండి ఒక మనిషికి పదింతలు పెద్దగా ఉండే షార్క్ చేపలు వరకు వివిధ జాతులు అందులో ఉన్నాయి.
అయితే మామూలుగా షార్క్ చేప నడవడం అనేది ఊహకు అందని విషయమే.అయితే ఇప్పటి వరకు అలా నడిచినట్టు ఎలాంటి ఆధారాలు కూడా లేవు.
తాజాగా కొందరు ఆస్ట్రేలియా పరిశోధకులు నడుస్తూ వెళుతున్న షార్క్ కు చేపను గుర్తించారు.అది వాటి రెక్కలను ఈతకు ఉపయోగించకుండా కాళ్ళని ఉపయోగిస్తూ సముద్రం అడుగుభాగాన ఇసుకలో ముందుకు వెళుతూ వారికి కనిపించింది.
నిజానికి ఇదో అరుదైన సంఘటన.ఇది కూడా ఓ రకమైన షార్క్ జాతి అని పరిశోధకులు తెలియజేస్తున్నారు.అయితే ఈ పరిశోధన ద్వారా ఓ విషయం తెలిసిందని వారు చెబుతున్నారు.అదేమిటంటే ఎక్కడైనా నీరు లేని ప్రాంతాల్లో షార్క్ చేపలు వెళ్లాలంటే వాటి రెక్కల ను ఉపయోగించి మరోచోటికి చేరుకోగలుగుతున్నాం అని తెలిపారు.
అయితే ఇందులో మొత్తం నాలుగు రకాల షార్క్ చేపలు ఇలా నడుస్తాయని పరిశోధకులు తేల్చారు.
ఇలాంటి నడిచే షార్క్ లు ఆస్ట్రేలియా దేశం లోని ఉత్తర ఆస్ట్రేలియా సముద్రాలలో ఎక్కువగా కనబడుతున్నాయి అని తెలుస్తోంది.
ఇవి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయని ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు.అది కూడా కేవలం చేపలు ఎక్కువగా లేని ప్రదేశాల్లో మాత్రమే ఈ షార్క్ చేపలు నివసిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
వీటికి ఆహారంగా ఆ చేపల కంటే చిన్న చిన్న చేపలను తిని ఇది జీవనం కొనసాగిస్తున్నాయని వారు తెలియజేశారు.