కోర్టులో వ్యాక్సిన్‌తో అడుగుపెడుతున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Pawan Kalyan Vakeel Saab After Corona Vaccine, Pawan Kalyan, Vakeel Saab, Dil Ra-TeluguStop.com

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు స్టన్నింగ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.కాగా కరోనా వైరస్ వల్ల నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను చివరిదశలో వాయిదా వేశారు.

అయితే ఇప్పట్లో సినిమా షూటింగ్‌లలో నటీనటులు పాల్గొనే ఛాన్సులు తక్కువగా ఉన్నాయనే వార్తతో వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే పవన్‌కు సంబంధించిన కోర్టు సీన్స్‌ను చిత్ర యూనిట్ షూట్ చేయాల్సి ఉండగా, ఆయన ఈ సినిమా షూటింగ్‌లో ఎప్పుడు పాల్గొంటాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా ఆగస్టులో కరోనా వ్యాక్సిన్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుండటంతో, సెప్టెంబర్ నుండి షూటింగ్‌లో పాల్గొనాలని పవన్ భావిస్తున్నాడట.

ఏదేమైనా కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న వకీల్ సాబ్, వీలైనంత త్వరగా ఈ షూటింగ్‌ను పూర్తి చేసుకుని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే విషయం తెలియాలంటే పవన్ సినిమా షూటింగ్‌లకు ఎప్పుడు పచ్చ జెండా ఊపుతాడో చూడాలి.ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube