ప్రస్తుతం సౌత్ ఇండియాలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది.ఎక్కువగా హిస్టోరికల్, మైథాలజీ కథలతో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేయడానికి పెద్ద దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
అన్ని రకాల సినిమాలు చేసేసిన వారు ఇక తన దర్శకత్వంలో నెక్స్ట్ లెవల్స్ చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే దర్శక దిగ్గజం మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తెరపైకి ఎక్కించేందుకు సిద్ధం అయ్యారు.
భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ మూవీ గా పొన్నియన్ సెల్వన్ సినిమాని ఆవిష్కరించబోతున్నారు.తమిళంలో తెరకెక్కుతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.
భారీ తారాగణంతో ఈ సినిమాని మణిరత్నం ప్లాన్ చేశారు.
విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చారిత్మ్రాతక చిత్రాన్ని ఎప్పుడో ప్రారంభించారు.
అయితే లాక్ డౌన్ కారణంగా ఆరంభంలోనే షూటింగ్ ఆగిపోయింది.అయితే జూలై నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
అందుకోసం పాండిచ్చేరిలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు.నెలరోజుల పాటు ఈ భారీ షెడ్యూల్ జరగనుందట.
విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తుంది.రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.
చోళుల కాలం నాటి కథాంశంతో ఈ సినిమా నవల ఆధారంగా తెరకెక్కుతుంది.