టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమంత.ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల అందరితో జత కట్టిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా తన హవా కొనసాగిస్తుంది.
ఈ మధ్య కాలంలో ఎక్కువగా లేడీ ఒరియాంటెడ్ కథలతో ప్రయోగాలు చేస్తూ తనకంటూ సొంతంగా గుర్తింపు క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడు రెండు లేడీ ఒరియాంటెడ్ సినిమాలకి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సెలబ్రిటీలని విపరీతంగా ఫాలో అయ్యే అభిమానులు ఉంటారు.
టాలీవుడ్ హీరోయిన్లలో సమంతకున్న సోషల్ మీడియా ద్వారా ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో కొత్త విషయాలు పంచుకుంటూ వుంటుంది.తన రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇప్పుడీ భామ ఇన్ స్టాగ్రాంలో కోటి మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.దీంతో ఆనందపడిపోతూ అభిమానులకు ఈ చిన్నది థ్యాంక్స్ చెప్పింది.
ఇప్పుడు తన కుటుంబం కోటి మందికి చేరింది అంటూ ఆసక్తికరంగా పోస్ట్ పెట్టింది.తనని ఫాలో అవుతూ అభిమానిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపింది.