ఎన్టీఆర్ తెలుగు నటుడు కాదంటున్న కత్తి

వివాదాస్పద క్రిటిక్ గా టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కత్తి మహేష్.పవన్ కళ్యాణ్ ఇష్యూతో పాపులర్ అయిన కత్తి మహేష్ తర్వాత హిందుత్వ దేవుళ్ళు, శ్రీరాముడు మీద పలు సందర్భాలలో వివాదాస్పద వాఖ్యలు చేయడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి భాగా సుపరిచితుడు అయిపోయాడు.

 Kathi Mahesh Interesting Comments On Jr Ntr, Tollywood, Rrr Movie, Tarak, Telugu-TeluguStop.com

అతనికి బిగ్ బాస్ సీజన్ వన్ కూడా కాస్తా గుర్తింపు అందించింది.కత్తి మహేష్ సినిమాల రివ్యూల విషయంలో అందరిని చీల్చి చెండాడిన అప్పుడప్పుడు ఎన్టీఆర్ అభిమానులకి మాత్రం కాస్తా సంతోషం ఇస్తాడు.

ఇప్పుడు తారక్ పుట్టిన రోజు సందర్భంగా అతనిని బర్త్ డే విషెస్ చేసి ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఈ వాఖ్యలు ఇప్పుడు తారక్ అభిమానులకి సంతోషాన్ని అందించాయి.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు నటుడు కాదు.కాకూడదు కూడా.

అది జరగాలని నేను కోరుకుంటున్నాను.ఎందుకంటే అతడిలో అంతర్జాతీయ నటనా ప్రతిభ ఉంది.

కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే అతని అద్భుతమైన నటనా చాతుర్యం పరిమితం అవుతుందేమోనని నేను భయపడుతున్నాను.మరి ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు.

ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తారక్ ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో కనిపించబోతున్నారు. రాజమౌళి సినిమా అంటే ప్రపంచం మొత్తం దాని వైపు చూస్తూ ఉంటుంది.

రాజమౌళి సినిమా ద్వారా తారక్ నటనా చాతుర్యం ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలలో కాకుండా ఎన్టీఆర్ నటనా ప్రతిభను పూర్తిస్థాయిలో చూపించే సినిమాలో తారక్ నటిస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని కత్తి మహేష్ తారక్ పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించిన విధానం అతని ఫ్యాన్స్ కి కాస్తా ఉత్సాహం అందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube