Patriotic Songs : దేశభక్తి పాటలు పెట్టడం వల్ల హిట్ అయినా సినిమాలు ఇవే !

తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వదు.అలా అని ప్లాప్ అయినా ప్రతి సినిమా చెడ్డ సినిమా ఏమి కాదు.

 Patriotic Songs : దేశభక్తి పాటలు పెట్టడం-TeluguStop.com

కొన్ని సార్లు ప్లాప్ అయినా సినిమాలో కూడా మంచి విషయాలు ఉంటాయి.అలాగే కొన్ని సినిమాలు నిలబడటానికి కూడా ఎదో ఒక కారణం మాత్రమే ఉండి ఉండచ్చు.

అలా దేశభక్తి పాటల వల్ల కూడా కొన్ని ప్లాప్ సినిమాలను మనం గుర్తు పెట్టుకునే అవకాశం ఉంది.అంతే కాదు కొన్ని ప్లాప్ సినిమాల్లో కూడా కేవలం ఒక దేశ భక్తి పాటలు( Patriotic songs ) మాత్రమే గుర్తుండే అవకాశం ఉంటుంది.

అలా దేశ భక్తి పాటల వల్లే గుర్తించబడ్డ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Telugu Bobby, Chandrakanth, Patriotic, Shankardada, Subbu, Sultan-Telugu Stop Ex

మొన్నటికి మొన్న RRR సినిమాలో కూడా ఒక దేశభక్తి పాట ఉంది అయినా కూడా అది పెద్ద ఎఫెక్టివ్ గా లేదు కానీ పీరియాడిక్ సబ్జెక్టు కాబట్టి పెట్టక తప్పలేదు.ఇక మహేష్ బాబు నటించిన బాబీ( Bobby ) సినిమా చాల పెద్ద ప్లాప్.కానీ అందులో వచ్చే వందే మాత్రం పాట మంచి హిట్.

ఈ ఒక్క పాట కోసం ఆ సినిమాను పక్క గుర్తు పెట్టుకోవచ్చు.బాలకృష్ణ, కృష్ణ మరియు కృష్ణం రాజు కలిసి నటించిన సుల్తాన్ సినిమా( Sultan movie ) పెద్ద ప్లాప్ కానీ ఆ సినిమాలో కూడా వందేమాతరం సినిమా( Vande Mataram movie ) అద్భుతంగా ఉంటుంది.

ఇక కాస్త వెనక్కి వెళ్తే బడి పంతులు చిత్రంలో భారత మాతకు జేజేలు పాట ఎంత చక్కగా ఉంటుందో చెప్పక్కర్లేదు.కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగు వీర లేవరా అనే పాట తో సినిమా పెద్ద విజయం సాధించింది.

Telugu Bobby, Chandrakanth, Patriotic, Shankardada, Subbu, Sultan-Telugu Stop Ex

వెలుగు నీడలు అనే సినిమాలో కూడా పాడవోయి భారతీయడా పాట ఇప్పటికి ప్రతి పల్లెల్లో వినిపిస్తూనే ఉంటుంది.బొబ్బిలి పులి సినిమాలో జనని జన్మభూమిచ్చ, ఖడ్గం సినిమాలో మేమే భారతీయులం పాటలు వింటే దేశభక్తి పొంగిపోతుంది.ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్( Major Chandrakanth ) సినిమాలో కూడా పుణ్య భూమి నా దేశం పాట వచ్చినప్పుడు రోమాలు నిక్కపొడుచుకుంటాయి.జూనియర్ ఎన్టీఆర్ సుబ్బు సినిమా( subbu movie ) ప్లాప్ కానీ అందులో వచ్చే దేశభక్తి గీతం చాలా బాగుటుంది.

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమాలో సైనిక పాట పెద్ద హిట్.బద్రి చిత్రంలో ఐ యాం ఇండియన్స్ పాట, పవన్ కళ్యాణ్ మరొక చిత్రం ఖుషి చిత్రంలో ఏ మేరా జహా, శంకర్ దాదా జిందాబాద్ లో ఓ బాపూ నువ్వే రావాలి పాట కూడా పెద్ద హిట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube