తెలుగులో ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించినటువంటి “అందాల రాక్షసి” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ తన సినీ కెరీర్లో సరైన హిట్ లేక పోవడంతో గుర్తింపుకు నోచుకో లేకపోయింది.
అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంది.
తాజాగా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా మాద్యమాల ద్వారా తన అభిమానులతో సంభాషించింది.
ఇందులో ఓ నెటిజన్ మీ సినీ జీవితంలో జరిగినటువంటి ఓ మర్చి పోలేని సంఘటన గురించి తెలియజేయాలని కోరాడు.దీంతో లావణ్య త్రిపాటి స్పందిస్తూ తాను మొదట్లో సినిమా పరిశ్రమకి వచ్చినపుడు చిత్ర షూటింగ్ లో పాల్గొనే సమయంలో తనకు కారవ్యాన్లు ఉండేవి కాదని అలాంటి సమయంలో ప్రొడక్షన్ వ్యాన్ లోనే బట్టలు మార్చుకొని షూటింగులకు హాజరయ్యే దానిని చెప్పుకొచ్చింది.
అలాగే ఇప్పుడు అందరికీ కారవ్యాన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి “విరుపాక్ష” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.అలాగే ఈ అమ్మడు ప్రముఖ దర్శకుడు జీవన్ కొలను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఏ వన్ ఎక్స్ ప్రెస్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం.