రానా మాకు పెద్ద పని పెట్టాడు

హీరో రానా ప్రేమ విషయం పై నిన్న ఆసక్తికర ప్రకటన చేసిన విషయం తెలిసిందే.తాను మిహిక బజాజ్ ను ప్రేమిస్తున్నాట్లుగా క్లారిటీ ఇచ్చేశాడు.

 Suresh Babu Respond On Rana Love Matter Rana, Suresh Babu, Meheka Bajaj, Marriag-TeluguStop.com

ఆమె తన ప్రేమను ఒప్పుకుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫోటోను షేర్ చేశాడు.అప్పటి నుండి కూడా రానా పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ విషయంలో రానా తండ్రి అయిన సురేష్ బాబు స్పందించారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.

రానా, మిహిక మంచి స్నేహితులు.ఇద్దరు ఇలా ప్రేమలో ఉన్నట్లుగా తెలిసి సంతోషపడ్డాం.

లాక్ డౌన్ కారణంగా పని ఏమి లేకుండా ఉన్న ఈ సమయంలో మాకు పెద్ద పనిని రానా పెట్టాడు.ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తాం.

అలా అని డిసెంబర్ వరకు కూడా ఆగము.పెళ్లికి సంబందించిన ఏర్పాట్లు మొదలు పెట్టాలి.

Telugu Bussiness, Meheka Bajaj, Rana, Rana Love, Suresh Babu-Movie

పెళ్లి డేటా విషయంలో రెండు కుటుంబాల పెద్దలం కూర్చుని మాట్లాడుతాం.లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పెళ్లి కి తేదీని ఖరారు చేస్తాం.ఈ సమయంలో పెళ్లి గురించి ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి.మొత్తానికి మా కుటుంబం కు ఇది పెద్ద విషయం అంటూ సురేష్ బాబు అన్నాడు.

Telugu Bussiness, Meheka Bajaj, Rana, Rana Love, Suresh Babu-Movie

రానా పెళ్లి విషయంలో సినిమా ప్రముఖులు చాలా స్పీడ్ గా స్పందించారు.రానా పెళ్లి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం.ఇన్నాళ్లకు ఆయన పెళ్లి చేసుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ స్నేహితులు కూడా పోస్ట్ పెడుతున్నారు.రానా చేసుకోబోతున్న అమ్మాయి హైదరాబాద్ లోనే మ్యారేజ్ ప్లానింగ్ బిజినెస్ నిర్వహిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube