స్కూల్ ఫీజులపై కీలక ప్రకటన చేసిన తెలంగాణా సర్కార్

కరోనా నేపథ్యంలో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే.వారి ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న తెలంగాణా సర్కార్ స్కూల్ ఫీజుల విషయం పై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

 Telangana Government Issues Key Orders On Student School Fees Telangana Governme-TeluguStop.com

రాబోయే విద్యా సంవత్సరంలో విద్యా సంస్థలు ఫీజులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచవద్దు అని దీనికి సంబంధించి ఒక జీవో ను కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది.ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేయగా తాజాగా అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Telugu Corona, School Fees, Telangana, Telangana Lock-General-Telugu

ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్ని స్కూల్స్ కు ,ఇతర విద్యాసంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించడం తో పాటు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది.ఈ జీవో ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం(2020-2021)లో ప్రైవేటు స్కూల్స్ ఫీజులను పెంచరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతేకాదు విద్యార్థులకు సంబంధించి కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని… అది కూడా ఒకేసారి కాకుండా నెలవారీగా తీసుకోవాలని జీవోలో స్పష్టం చేసింది.ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తామని తెలంగాణా సర్కార్ హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం తో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీనితో చాలా మంది ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణా సర్కార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube