ఎమ్మెల్యే వంశీకి ఏమైంది ? రాజీనామా చేస్తున్నారా ?

ప్రస్తుతం నడుస్తున్నవన్నీ కరోనా రాజకీయాలే.రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఇదే అంశంపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి.

 Vallabhanenu Vamshi Face Book Post Goes On Viral, Tdp , Gannavaram, Chandrababu-TeluguStop.com

ప్రజలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరికి వారు కరోనాకు సంబంధించిన హడావుడి లో ఉండగా, ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించే విధంగా ఓ ఎమ్మెల్యే తన సోషల్ మీడియా కథలు పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఆయనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.అయితే వైసీపీ లో అధికారికంగా చేరితే అనర్హత వేటు పడుతుంది అనే ఉద్దేశంతో, ఆ పార్టీలో చేరకుండానే ఆ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఇప్పటికే రెండు మూడు సార్లు సీఎం జగన్ ను కూడా వంశీ కలిశారు.

Telugu Chandrababu, Gannavaram, Gannavaram Mla, Vamshi, Ycp Ydp-Political

ఇక రాజీనామా చేసిన అనంతరం కూడా అనేక సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఇక ఆయనకు వైసీపీలో సముచిత స్థానం లభిస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో, వంశీ అకస్మాత్తుగా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది ” 2006 వ సంవత్సరం ఇదే రోజు గన్నవరం నుండి నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది 14 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలు లో వెన్నంటి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు ” అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.అయితే సాధారణ పరిస్థితుల్లో ఈ పోస్టు కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు, కానీ ఆయన టీడీపీ కి రాజీనామా చేయడం, వైసీపీలో చేరడంతో ఈ పోస్టు కు ప్రాధాన్యం ఏర్పడింది.

Telugu Chandrababu, Gannavaram, Gannavaram Mla, Vamshi, Ycp Ydp-Political

అసలు రాజకీయ ప్రస్థానం అంటూ తన పోస్టులో పేర్కొనడంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే అంచనాకు అంతా వచ్చేశారు.రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనతోనే ఈ విధంగా పోస్టు పెట్టారు అనే అభిప్రాయం అంతా వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం వల్లభనేని వంశీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.వాస్తవంగా వైసీపీలో ప్రాధాన్యం బాగానే ఉంది.వంశీ కోసం అక్కడ వైసీపీ ఇన్చార్జిగా ఉన్న వెంకట్రావుకు జగన్ నచ్చచెప్పి ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చాడు అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఈ విధంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వంశీ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతారనే సందేహం ఆయన అభిమానుల్లోనూ వ్యక్తమవుతోంది ఏదేమైనా మరో రెండు రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube