ఎన్నారైల డిమాండ్..నిర్మలమ్మ కరుణించేనా...!!

ఎన్నారైలకి భారత ప్రభుత్వం టాక్స్ విషయంలో కొన్ని నిభందనలు విధించింది.కానీ కరోనా కారణంగా ఇప్పుడు వారికి ఆ నిభందన గుదిబండగా మారింది.

దాంతో అమెరికాలోని గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అనే సంస్థ ఇప్పుడు కేంద్రానికి ఎన్నారైల తరుపున డిమాండ్ చేస్తోంది.గతంలోనే సదరు సంస్థ ఈ డిమాండ్ ని లేవనెత్తినా ప్రస్తుత పరిస్థితులలో ఇది అనివార్యమని అంటోంది.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షకి పైగా ప్రజలు మృతి చెందారు.లక్షల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

ఈ కారణంగా కరోనా కట్టడిలో భాగంగా అన్ని దేశాలు విమానయాన ప్రయాణాలు రద్దు చేసాయి దాంతో ఎంతో మంది ఎన్నారైలు భారత్ లోనే ఉండిపోయారు.ఫైనాన్స్ యాక్ట్ 2020 ప్రకారం చూస్తే ఎవరైతే 120 రోజుల లోపు ఇండియాలో ఉంటే అతడు ఎన్నారై గా గుర్తించబడుతారు.

Advertisement

దాంతో ఎన్నారైలు సంపాదించిన సొమ్ముకి పన్ను నుంచీ మినహాయింపు ఉంటుంది కానీ విదేశాలకి వెళ్ళలేక ఉండిపోయిన ఎన్నారైల పరిస్థతి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అంటోంది.అందుకే తాము గతం నుంచీ డిమాండ్ చేస్తున్న 120 రోజులని 180 రోజులకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రం తెచ్చిన ఈ యాక్ట్ ప్రస్తుతం ఎన్నారైలకి గట్టి ఎదురు దెబ్బే అంటున్నారు చార్టెడ్ అకౌంటెంట్ లు.మరి ఎన్నారైల డిమాండ్ కి నిర్మలా సీతారామన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు