ఆర్ఎక్స్ 100 దర్శకుడుకి హ్యాండ్ ఇచ్చిన శర్వానంద్

ఆర్ ఎక్స్ 100 సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన ఆర్జీవీ శిష్యుడు అజయ్ భూపతి.ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న ఈ దర్శకుడుకి ఊహించని క్రేజ్ సొంతం అయ్యింది.

 Sharwanand Not Interested To Act In Ajay Bhupathi Director, Tollywood, South Cin-TeluguStop.com

ఇక ఈ సినిమాతో నిర్మాతలు కూడా అజయ్ భూపతితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు.అయితే ఆర్ఎక్స్ సినిమా తర్వాత అజయ్ భూపతి మహా సముద్రం అనే కాన్సెప్ట్ తీసుకొని హీరోల చుట్టూ తిరుగుతున్నాడు.

మొదటి సినిమా తరహాలోనే ఇది కూడా డిఫరెంట్ కంటెంట్ సినిమా కావడంతో హీరోలు ముందుకి వస్తూనే మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు.

ఇక ఫైనల్ గా ఈ సినిమాకి శర్వానంద్ ఒకే చెప్పాడు.

ఇక ఈ సినిమాని సమంత, శర్వానంద్ కాంబినేషన్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది అని ఊహాగానాలు కూడా వినిపించాయి.

అయితే ఊహించని విధంగా ఇప్పుడు అజయ్ భూపతికి శర్వానంద్ హ్యాండ్ ఇచ్చాడని టాక్ నడుస్తుంది.గత కొంత కాలంగా వరుస ఫ్లాప్ లతో ఉన్న శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఇలాంటి టైంలో మరల డిఫరెంట్ కంటెంట్ తో సినిమా అంటే ఇబ్బందికరమైన పరిస్థితి అని భావించి దర్శకుడుకి సారీ చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.దీంతో ఇప్పుడు మరల దర్శకుడు అజయ్ భూపతి ఖాళీ అయిపోయాడని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube