వాలంటీర్లు మందును డోర్‌ డెలవరీ చేస్తున్నారు

ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకు వచ్చి తమకు చెందిన వారి బ్రాండ్స్‌ను మాత్రమే మార్కెట్‌లో ఉండేలా చేస్తుందని, తద్వారా కల్తీ మద్యంను జనాలు తాగుతున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకుడు బోండా ఉమ అన్నాడు.వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్లు ప్రస్తుతం మద్యంను డోర్‌ డెలవరీ కూడా చేస్తున్నట్లుగా ఎద్దేవ చేశాడు.

 Ap Village Volunters Do The Alcohol Door Delivery-TeluguStop.com

గ్రామ వాలంటీర్లను అన్ని విధాలుగా వాడుకుంటూ వారికి సరైన జీతం కూడా ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు మద్యం వారితో మోపిస్తుంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మద్యం సిండికేట్స్‌తో కుమ్మక్కు అయ్యి కొత్త కొత్త బ్రాండ్స్‌ను తీసుకుని వచ్చి ఇప్పుడు ప్రజలపై వాటిని ఎక్కువ రేటుకు రుద్దడంతో పాటు నాణ్యత లేని మద్యంను అంటకడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఏ విధంగా సాధ్యం అయితే ఆ విధంగా వైకాపా ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని, మద్యంతో ప్రజల ఆరోగ్యాలను కూడా నాశనం చేస్తుందని ఆయన అన్నాడు.ప్రస్తుతం ఏపీలో చాలా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube