గుడిలో భరతం పడుతున్న ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో చిరంజీవి పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

 Chiranjeevi Temple Fight Sequence To Be Highlight In Acharya-TeluguStop.com

ఈ సినిమాలో చిరంజీవి సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ సినిమాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాతో చిరంజీవి మాస్ ప్రేక్షకులకు మరోసారి దగ్గర కానున్నట్లు తెలుస్తోంది.పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని, వాటిలో గుడిలో జరిగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఒక సీన్‌లో చిరంజీవి గుడిలో ఫైట్ చేసే సీక్వెన్స్ చాలా బాగుంటుందని, ఈ సీన్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని వారు అంటున్నారు.

మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఈ సినిమాలో చిరంజీవి ఓ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తాడని తెలుస్తోంది.

అందాల భామ త్రిష ఈ సినిమాతో మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది.ఇక ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మరి గుడిలో దుండగుల పంతం చిరు ఎలా పడతాడో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube