జామియా యూనివర్సిటీ ప్రాంతంలో కాల్పులు జరిపిన ఆగంతకుడు

దేశ రాజధాని ఢిల్లీ లోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సటీ ప్రాంతంలో ఒక ఆగంతకుడు కాల్పులకు పాల్పడ్డ ఘటన సంచలనం సృష్టించింది.ఆజాదీ కావాలి అని పెద్ద పెద్దగా అరుస్తూ నినాదాలు చేస్తూ రివాల్వర్ తో కాల్పులు జరిపాడు.

 Jamia Milia Islamia-TeluguStop.com

కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా గత కొద్దీ రోజులుగా ఢిల్లీ లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సీఏఏ కు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీ లో ఈ ఘటన చోటుచేసుకోవడం అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది.

సీఏఏ కు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ర్యాలీ ని వ్యతిరేకిస్తూ ఒక ఆగంతకుడు ఉన్నట్టుండి కాల్పులకు పాల్పడ్డాడు.దీనితో ఒక విద్యార్థి గాయాలపాలైనట్లు తెలుస్తుంది.

అయితే ఆ ఆగంతకుడు ఎవరు,అసలు ఎందుకు విద్యార్థుల పై కాల్పులకు తెగబడ్డాడు అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.అయితే విద్యార్థులు మాత్రం పోలీసులే కాల్పులకు దిగారంటూ ఆరోపిస్తున్నారు.

సీఏఏ, ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా జామియా కోఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) ర్యాలీ నిర్వహించింది.జామియా నగర్ నుంచి రాజ్ ఘాట్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.

ఈ నేపథ్యంలో కాల్పులు చోటుచేసుకోవడం తో పోలీసులు అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

Telugu Jamia Delhi, Telugu Ups-Latest News - Telugu

తుపాకీతో హ‌ల్‌చ‌ల్ చేసిన వ్య‌క్తిని 31 ఏళ్ల గోపాల్‌గా అధికారులు గుర్తించారు.అతడు గ‌న్‌తో బెదిరిస్తూ.స్వాతంత్య్రం ఎవ‌రికి కావాలంటూ గ‌ట్టిగా అరిచాడు.

మిమ్మ‌ల్ని షూట్ చేస్తానంటూ సీఏఏ నిర‌స‌న‌కారుల‌ను బెదిరించడం తో వారంతా హడలిపోయి భయంతో చూస్తూ ఉండిపోయారు.అయితే దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆగంతకుడు గోపాల్ ఇండియాలో ఉండాలనుకుంటే జైశ్రీరామ్ అని కాదు వందే మాతరం అని అనాలి అంటూ పెద్ద పెద్దగా అరిచినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube