నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం రూలర్ రిలీజ్కు రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.కాగా బాలయ్య తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇటీవల ప్రారంభించాడు.
ఇక ఈ సినిమాలో బాలయ్య మునుపెన్నడు కనిపించని పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ బాలీవుడ్ స్టార్ బ్యూటీని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్లో తన అందాలతో పాటు నటనతోనూ ఇంప్రెస్ చేసిన సోనాక్షి సిన్హాను బాలయ్య సరసన నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీనికి సంబంధించి ఆమెతో చర్చలు కూడా జరిపారట చిత్ర యూనిట్.
బాలయ్య లాంటి పవర్ఫుల్ యాక్టర్ పక్కన సోనాక్షి అయితే సూపర్ కాంబినేషన్ అవుతుందని బోయపాటి ప్లాన్.
అటు సోనాక్షికి ఈ సినిమా కోసం భారీగా ముట్టచెప్పనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆమె ఈ సినిమాను ఒప్పుకుంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఏదేమైనా బాలయ్య కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ను రంగంలోకి దించేందుకు బోయపాటి చాలా కష్టపడుతున్నాడట.
దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే మరి.