అంజలి తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో పలు సూపర్ హిట్ట్ చిత్రాల్లో నటించింది.
అంజలి సినిమా కెరీర్ జర్నీ సినిమాతో ప్రారంభం అయింది.ఈ చిత్రంతో జై హీరో గా పరిచయం అయ్యాడు.
జర్నీ సినిమాతో అంజలి అండ్ జై ల మద్య చాలాకాలం ప్రేమ వ్యవహారం నడిచింది.ఆ నేపద్యంలోనే వీరిద్దరూ బెలూన్ అనే చిత్రంలో నటించారు.
ఆ చిత్రా నిర్మాత నందకుమార్ అంజలి మరియు జై రిలేషన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

జై అంజలి జీవితంలో కి వచ్చిన తరువాత, ఆమె జీవితం గాడి తప్పింది.జై ప్రవర్తన వలన ఆ సినిమాకు నిర్మాతగా ఉన్న నేను చాల నష్ట పోయాను.ఒక్కసారి కొడైకెనాల్ లో షూటింగ్ జరుగుతునప్పుడు హీరో, హీరోయిన్స్ కు మా అందరికి సపరేట్ గా రూమ్స్ బుక్ చేసాం కానీ వారిద్దరూ ఒక్కే రూమ్ లో ఉండేవాళ్ళు.
అందువలన మేము హీరొయిన్ కోసం బుక్ చేసిన రూమ్ కాన్సుల్ చేద్దాం అంటే జై ఉరుకునేవాడు కాదు.అందు చేత ఆ రూంకు కుడా మేము రెంట్ చేలించవలిసి వచ్చేది.

షూటింగ్ స్పాట్ లో ఎవరైనా అంజలి అని పేరు పెట్టి పిలిస్తే జై ఉరుకునేవాడు కాదు మేడమ్ అని పిలవాలి అలా పిలవకపోతే షూటింగ్ ఆపేసి వెళ్లి పోతానుని బెదిరించేవాడు.ఒక్కసారి అంజలి మేడమ్ షూటింగ్ కు రాకపోతే మేము చాలా సార్లు ఫోన్ చేసాం కానీ తను ఫోన్ తియ్యలేదు.ఆ తరువాత తనే మాకు ఫోన్ చేసి నాకు కడుపు నొప్పిగా ఉన్నది నేను ఈ రోజు షూటింగ్ రాలేను అని ఫోన్ చేసింది.ఆ రోజు రూమ్ కి కార్ కూడా పంపించాం కానీ అదే కార్ లో ఎయిర్పోర్ట్ నుండి చెన్నై కి వెళ్ళిపోయారు.
జై వలన ఆ సినిమాకు నేను చాలా నష్టపోయాను అని నందకుమార్ చెప్పాడు.