కేంద్ర అధికార పార్టీ బీజేపీకి ఏపీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో స్పష్టమైన క్లారిటీ రావడంలేదు.దక్షణాది రాష్ట్రాల్లో బలపడాలనే కుతూహలం బీజేపీలో ఎక్కువయ్యింది.
అందుకే ముందుగా తాను స్నేహం చేసున్న, పరోక్షంగా పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలతో విరోధం పెట్టుకునేందుకు కూడా బీజేపీ వెనుకాముందు ఆలోచించడంలేదు.

ప్రాంతీయ పార్టీల్లో ఉన్న ఎమ్యెల్యేలు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకుని వాటిని బలహీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.ముఖ్యంగా ఏపీపై బీజేపీ ప్రధానంగా దృష్టిపెట్టింది.ఇక్కడ వచ్చే ఎన్నికల నాటికి కుదిరితే అధికారం లేకపోతే ప్రధాన ప్రతిపక్షం హోదా అనే విధంగా బీజేపీ అడుగులు వేసుకుంటూ వెళ్తోంది.
దీని కారణంగానే కొంతకాలంగా బీజేపీ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది.ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక్క నియోజకవర్గంలోనూ తన సత్తా చాటలేకపోయింది.కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏపీలో బలపడలేకపోయామనే బాధ బీజేపీ అగ్ర నాయకుల్లో ఎక్కువ కనిపిస్తోంది.

అందుకే ఏపీలో టీడీపీ, బీజేపీలను బాగా బలహీనం చేసి తాము బలపడాలనే కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తోంది.ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉన్నా వైసీపీని ఇబ్బంది పెట్టడంలో అనుకున్న స్థాయిలో ఆ పార్టీ సక్సెస్ కాలేకపోతోంది.అందుకే ఇప్పడు టీడీపీ విషయాన్ని పక్కనపెట్టి బీజేపీ ముందుకు దూకుతోంది.
వైసీపీ ప్రభుత్వంలో నెలకొన్న ప్రతి లోపాన్నీ ఎత్తి చూపడం తోపాటు కొన్ని విషయాల్లో వారు సక్సెస్ కూడా అయ్యారు.రైతు భరోసా కార్యక్రమం ప్రారంభించిన జగన్ పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు .ఈ పథకానికి కేంద్రం నుంచి నిధులు అందు తున్నాయని, ఒక్కొక్క రైతుకు కేంద్రమే రూ.6500 ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన పథకంగా ఎలా చెప్పుకొంటుందని, దీనికి ప్రధాని పేరు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు.దీంతో చేసేది లేక జగన్ కూడా వైఎస్సా రైతు భరోసా-ప్రధాని కిసాన్ యోజనగా ఈ పథకానికి పేరు మర్చి బీజేపీ ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకున్నాడు.ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీ తొలి విజయం ఇక్కడే స్టార్ట్ అయ్యింది.

బీజేపీ ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆపరేషన్ క్రాస్ పేరుతో ఏపీలో పూర్తిగా చ క్రం తిప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.దీనిలో భాగంగానే జగన్ ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న తెలుగు మీడియం రద్దును భుజాలకు ఎత్తుకుంది.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్ర వేశ పెట్టడం ద్వారా మత మార్పిడులను ప్రోత్సహించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే కొత్త ఆరోపణలతో ఆ పార్టీ మీద విరుచుకుపడుతోంది.ఈ నేపథ్యంలోనే కొందరు ఎంపీలను కూడా తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది.
ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే తర్వాత రాష్ట్ర పరిధిలో జగన్ ప్రభుత్వం అనర్హత వేటు వేస్తే బీజేపీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.అందుకే ఎంపీలను బీజేపీలో చేర్చుకుంటే అనర్హత వేటు అధికారం అంతా కేంద్రంలోని ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని భావిస్తున్నారు.
ఇలా చేయడం ద్వారా మానసికంగా వైసీపీని దెబ్బతీయవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోంది.