ఇస్మార్ట్‌ కాంబో రిపీట్‌పై సగం క్లారిటీ

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.75 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు.నిర్మాత పూరికి ఈ చిత్రం దాదాపుగా పాతిక కోట్ల వరకు లాభాలను మిగిల్చిందంటూ సమాచారం అందుతోంది.అంతటి సక్సెస్‌ను దక్కించుకున్న ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంకు సంబంధించిన కాంబో రిపీట్‌ అవ్వబోతుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

 Ismart Shankar Sequel-TeluguStop.com

పూరి అప్పట్లోనే డబుల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ తీస్తానంటూ ప్రకటించాడు.కాని ఆ సినిమా పట్టాలెక్కదేమో అని చాలా మంది అనుకున్నారు.

అయితే ఇస్మార్ట్‌ విజయం సాధించిన తర్వాత మళ్లీ ఖచ్చితంగా రామ్‌ తో సినిమా చేయాల్సిందే అంటూ చాలా పట్టుదలతో దర్శకుడు పూరి ఉన్నాడు.అందుకే అందుకు సంబంధించిన చర్చలు కూడా ఒక వైపు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా అందుతోంది.

Telugu Charmi, Energetic Ram, Ram, Ismartshankar, Nidhi Agarwal, Purijaggannath-

రామ్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత పూరి దర్శకత్వంలో మూవీ ఉంటుంది.పూరి కూడా ప్రస్తుతం తన సినిమాను విజయ్‌ దేవరకొండతో చేస్తున్నాడు.ఫైటర్‌ అనే టైటిల్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా పూరి మూవీస్‌ ఉంటాయి.కనుక ఆయన దర్శకత్వంలో నటించేందుకు యంగ్‌ హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అలాంటిది మరో అవకాశం రామ్‌కు వచ్చింది.

వచ్చే ఏడాది ప్రారంభం అయ్యి 2021లో విడుదల అయ్యే ఛాన్స్‌ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube