రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.భారీ ఎత్తున ఈ చిత్రంకు సంబంధించిన అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ సంచలనం సృష్టించాడు.ఇప్పుడు వరుసగా పాటలను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించడంతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకుడు లోకేష్‌ను ఉడికించే ప్రయత్నం చేస్తున్నాడు.
నారా లోకేష్‌ను పప్పు అంటారని నాకు తెలియదు అని, ఆయన గురించే అసలు నాకు తెలియదు అంటూ చెబుతున్న వర్మ మరోపాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.పప్పులాంటి అబ్బాయి అంటూ వర్మ పాటను విడుదల చేశాడు.చాలా ఫన్నీగా సాగుతున్న ఆ పాటలో తాతగారి సైకిల్‌ను ఇకపై అయినా వదిలేయ్ డాడీ అంటూ చెబుతూ లిరిక్స్ సాగుతున్నాయి.
విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ పాట కొందరికి తెగ నవ్వు తెప్పిస్తుంటే మరి కొందరు మాత్రం కోపంతో రగిలి పోతున్నారు.
ఈ సినిమాలో తెలుగు దేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు అంటూ వర్మపై ఆరోపణలు చేస్తుంటే వర్మ మాత్రం తాను ఎవరికి టార్గెట్ చేయడం లేదు అంటూ ప్రకటించాడు.ఇది పూర్తిగా వివాద రహిత సినిమా అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.వర్మ ఈ చిత్రంను త్వరలోనే విడుదల చేయబోతున్నాడు.
పవన్, చంద్రబాబు, లోకేష్ ఇలా అందరిని టార్గెట్ చేసి వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.