భార్యాభర్తలు పండంటి కాపురం చేసి పిల్లల్ని కంటుంటే వారి పెద్దవాళ్లు, కుటుంబసభ్యులు సంతోషపడుతుంటారు.కానీ బీహార్‌లో జరిగిన ఓ ఘటన గురించి మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ముక్కున వేలేసుకోవడం ఖాయం.
ఎందుకంటే అక్కడ ఓ భార్యకు కడుపు పండింది కేవలం ఆమె భర్త కలలో రావడంతోనేనట.ఇది వినడానికే విడ్డూరంగా ఉన్నా ఆ భార్య చెబుతున్న వాస్తవం.
బీహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యను వదిలి కోల్‌కత్తాలో ఏడు నెలలుగా నివసిస్తున్నాడు.కానీ ఆ భార్య గర్భం దాల్చిందంటూ అతడి సోదరి పోలీసులను ఆశ్రయించింది.
తన వదిన గర్భంలో ఉన్న బిడ్డకు డీఎన్‌ఏ జరపాలంటూ కోరింది.తన సోదరుడు లేకుండా తన వదిన గర్భం ఎలా దాల్చిందంటూ ఆమె ప్రశ్నించింది.
అయితే ఇదే విషయంపై గ్రామపెద్దలు పంచాయతీ కూడా నిర్వహించారు.అందులో సదరు భార్య చెప్పిన సమాధానం విని అందరూ ముక్కున వేలేసుకున్నారు.
తన భర్త రోజూ కలలోకి వచ్చేవాడని.అందుకే తాను గర్భం దాల్చానని చెప్పింది.
దీంతో పోలీసులు ఆ భార్య ఫోనును పరిశీలించగా ఓ యువకుడితో ఎక్కువ చనువుగా ఉన్నట్లుగా మెసేజీలు ఉండటంతో అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు.కాగా ఈ వార్త ఆ పరిసర ప్రాంతాల్లో విడ్డూరంగా మారి ఆ గ్రామాన్ని వార్తల్లో నిలబెట్టింది.