ఏమీ తెలియని ఓ నాలుగున్నరేళ్ల పాపపై ఓ కామాంధుడు తన వికృత చేష్టలు చేయబోయి కటకటాలపాలైన ఘటన తమిళనాట చోటు చేసుకుంది.తమిళనాడులోని మధురైలో జరిగిన ఈ ఘనట సభ్యసమాజం సిగ్గుపడేలా చేసేందుకు ఉదాహరణగా మిగులుతుందని అనుకుంటున్నారు అంతా.
ఇంతలోపే ఆ చిన్నారి తల్లి జాగ్రత్త పడటంతో ఆ కామాంధుడికి తగిన బుద్ధి చెప్పడం జరిగింది.
మధురై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఓ మహిళ తన నాలుగేళ్ల చిన్నారితో బంధువుల ఇంటికి వెళ్లేందుకు అరపాలయం బస్సు టర్మినల్లో వేచి ఉంది.తనకు దాహం వేయడంతో నీటికోసం చిన్నారిని వదిలి పక్కకు వెళ్లింది.
ఇంతలోనే ఎక్కడి నుండి వచ్చాడో తెలియని ఓ వ్యక్తి తన చిన్నారి ఎత్తుకుని.ఇష్టారీతిలో చేతులు తాకుతూ.
ముద్దులు పెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఇది గమనించిన ఆ చిన్నారి తల్లి వెంటనే అప్రమత్తమయ్యింది.
పరిగెడుతూ వెళ్లి తన బిడ్డను ఆ కామాంధుడి చేతుల్లోంచి తనచెంతకు లాక్కుంది.అయినా ఆ కామాంధుడు బెదరకుండా ఆమెతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా అరిచింది.
దీంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసుకుని పోలీసులకు అప్పగించారు.కాగా చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.