అమెరికా మహిళ 350 ఫేక్ అకౌంట్స్..ఎందుకో తెలుసా

అమెరికాలో ఫ్లోరిదాకి చెందిన ఓ మహిళ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన స్నేహితుల్ని భయభ్రాంతులకి గురి చేసింది.అయితే ఎవరో తమని వేధిస్తున్నారు అని భయపడిన వారు పోలీసులకి ఫిర్యాదు చేయగా చివరికి తన సన్నిహితురాలే ఇలా చేసిందని తెలుసుకుని షాక్ అయ్యారు.

 Florida Woman Crates 350 Instagram Fake Account-TeluguStop.com

పోలీసులు తెలిపిన కధనం ప్రకారం.

ఫ్లోరిడాలో హాలిడే ప్రాంతానికి చెందిన మేరీ అనే మహిళ 2016 నుంచీ 2018 వరకూ కూడా మొత్తం 350 ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసింది.

వాటితో పాటు 18 ఈ మెయిల్స్ కూడా క్రియేట్ చేసింది.వీటి ద్వారా తనకి గతంలో స్నేహితులుగా ఉన్న ఆరుగురికి మెసేజ్ లు ఈ మెయిల్స్ చేయడం మొదలు పెట్టింది.

వారిని వేధింపులకి గురిచేయడంతో పాటు, భయపెట్టేదని భాదితులు వాపోయారు.

అంతేకాదు వారితో ఫోన్ నెంబర్ తో మాట్లాడేది.

మాట్లాడే సమయంలో తన గొంతు వాళ్ళు గుర్తు పట్టకుండా జాగ్రత్తలు పడేది.వారికి ఎటువంటి సందేశాలు పంపేది అని పరీక్షిస్తే.

మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా కోసేస్తా అంటూ రెండు కత్తులతో ఉన్న ఫోటోలు పంపేది.భాదితులు ఈ మెసేజ్ లకి తీవ్ర మానసిక వేదన అనుభవించే వారు.

అయితే పోలీసులు ఎట్టకేలకి ఆమెని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచాగా కోర్టు ఆమెకి నాలుగేళ్ల జైలు శిక్షని విధించిందని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube