ఆర్టికల్ 370 వంక చూపించి భారత్ పై రంకెలేస్తున్న ఇమ్రాన్ ఖాన్! ఐరాసలో కంప్లైట్

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఆర్టికల్ 370 పాకిస్తాన్ మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో చెప్పడానికి గత రెండు రోజులు ఆ దేశ ప్రభుత్వం పడుతున్న టెన్షన్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.మన దేశంలో అంతర్గత వ్యవహారం మీద పాకిస్తాన్ ఎందుకంతగా ఆలోచిస్తుంది అని ప్రతి భారత్ అభిమాని ఆలోచిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.

 Pmimran Khan Led Pakistanbreaks Businessbased-TeluguStop.com

ఈ ఆర్టికల్ 370 రద్దు కారణంగా కాశ్మీర బూచి చూపించి పాకిస్తాన్ ఇండియాని భయపెట్టే ప్రయత్నం ఓ వైపు చేస్తూ, మరో వైపు భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే అవకాశం లేకుండా పోయింది.దీంతో ఉగ్రవాదుల కనుసంనల్ల్లో నడుస్తున్న ఆ దేశ ఆర్మీ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఒత్తిడితో భారత్ కాశ్మీర్ అంశంలో దూరిపోయి అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ లో ఉన్న ముస్లిం ప్రజల హక్కులు భంగం కలిగించే విధంగా ఉందని వాదిస్తూ కాశ్మీర్ మీద లేని ప్రేమని చూపిస్తున్నారు.

అదే సమయంలో భారత్ పై కాలు దువ్వె ప్రయత్నం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చేస్తుంది.ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి కార్యాలయంలో ఎన్ఎస్సి సమావేశానికి అధ్యక్షత వహించారు.భారత ప్రభుత్వం ఏకపక్ష మరియు చట్టవిరుద్ధమైన చర్యల వల్ల తలెత్తే పరిస్థితి, భారతీయ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న పరిస్థితిని కమిటీ చర్చించింది.ఇమ్రాన్ ఖాన్, షా మెహమూద్ ఖురేషి, ఫిర్దాస్ ఆషిక్ అవన్ తదతర ముఖ్య నాయకులు ఈ‌ సమావేశల్లో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ భారత్ కి వ్యతిరేకంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.వాటిలో భారత్‌తో దౌత్య సంబంధాలను తగ్గించడం.

భారత్‌తో ద్వైపాక్షిక పూర్తిగా వాణిజ్యాన్ని నిలిపేయడం, భద్రతా మండలితో పాటు ఇండియా మీద ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయడంతో పాటు భారత్ రాయబారిని పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్ బహిష్కరించాడు.మరి ఇండియాని నియంత్రించడానికి ఇమ్రాన్ ఖాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఎంత వరకు ఫలితం ఇస్తాయి అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube