ఏదో సినిమాలో కమెడియన్ జైల్లో ఉంటే అన్ని ఫ్రీగా దొరుకుతాయి, అదే బయట ఉంటే ఏ పని చేయలేము, తినడానికి తిండి కూడా ఉండదు.అందుకే నేను బయట కంటే జైల్లో ఉండేందుకే ఇష్టపడతాను అంటూ అంటాడు.
అచ్చు ఇలాగే నిజ జీవితంలో కూడా జరిగింది.ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అతడు బయట జీవితం గడపలేక పోతున్నాడు.కనీస అవసరాలకు కూడా అతడి వద్ద డబ్బు లేకపోవడంతో చేసేది లేక జైల్లో ఉండాలని నిర్ణయించుకుని కావాలని నేరం చేసి జైలుకు వెళ్లాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొన్ని నెలల క్రితం ఇంగ్లాండ్‌లోని బౌర్నేమౌత్ అనే ప్రాంతానికి చెందిన లౌరెన్స్ జేమ్స్ వండర్ అనే వ్యక్తి అద్దె చెల్లించక పోవడంతో ఓనర్ విసిగి పోయి ఇల్లు ఖాళీ చేయించాడు.నెలల తరబడి అద్దె చెల్లించక పోవడంతో జేమ్స్‌ను ఓనర్ బయటకు పంపించడం జరిగింది.రోడ్డున పడ్డ జేమ్స్ ఎక్కడకు వెళ్లాలో అర్థం కాలేదు.రోడ్డుపై ఉండలేని పరిస్థితి.చలికి గడ్డ కట్టుకు పోయేలా వాతావరణం ఉంది.అలాంటి సమయంలో అతడికి ఒక ఆలోచన వచ్చింది.
బ్యాంకు రాబరీ చేయాలనుకున్నాడు.అయితే అతడు నిజంగా రాబరీ చేయకుండా అలా నటించాలనుకున్నాడు.
ఒక అరటి పండు తీసుకుని దానికి నల్ల కవర్‌ను తొడిగి దాన్ని గన్‌గా చూపించి ఒక బ్యాంక్ క్యాషియర్ వద్ద డబ్బులు వసూళ్లు చేశాడు.అది నిజమైన గన్ అనుకుని బ్యాంకులో ఉన్న వారు అంతా కంగారు పడ్డారు.
ఎవరు కూడా జేమ్స్ వద్దకు వచ్చే సాహసం చేయలేదు.జేమ్స్ క్యాషియర్ వద్ద డబ్బు తీసుకుని బయటకు వెళ్లాడు.
ఆ డబ్బును తీసుకు వెళ్లి పోలీసులకు అప్పగించి తాను చేసిన పనిని చెప్పుకొచ్చాడు.అతడి పనికి పోలీసులు కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు.
ఇప్పుడు అతడు హాయిగా జైల్లో ఉన్నాడు.అతడు విడుదలకు కొంత సమయం ఉంది.
విడుదలైన తర్వాత ఏం చేయాలా అని అప్పుడే అతడికి టెన్షన్ పట్టుకుందట.ఏ పని దొరక పోతే మళ్లీ ఏదో ఒక తప్పు చేసి జైలుకే వెళ్తాడేమో.!
.