కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయనడంలో కొంచెం నిజం కూడా ఉందంటున్న నిపుణులు.. ఎలా అంటే!

దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కొద్ది సేపటి వరకు పక్కన పెడితే కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయా అనేది ఇప్పుడు చర్చిద్దాం.కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయని, పూర్వ కాలంలో ఇంట్లోకి దెయ్యాలు రాకుండా ఉండేందుకు కుక్కలను పెంచుకునే వారు.

 Can Dogs Detect Ghosts-TeluguStop.com

దెయ్యాలు కుక్కలను చూసి భయపడేవని, కుక్కలు ఉన్న ఇంటికి దూరంగా దెయ్యాలు ఉండేవి అనేది అప్పటి వారి వాదన.రాత్రి సమయంలో ఏదైనా మెరుపు లాంటిది వచ్చి కుక్కలు మెరిగాయి అంటే అప్పుడు దెయ్యాలు కుక్కలకు కనిపించినట్లుగా భావిస్తారు.

కుక్కలకు రాత్రి సమయంలో చూసే శక్తి ఉంటుంది.చిమ్మ చీకట్లో సాదారణ మనుషులు చూడలేని రూపాలను కుక్కలు చూస్తాయని, అందుకే వాటికి దెయ్యాలు కనిపిస్తాయని జనాలు అనుకుంటూ ఉంటారు.

అయితే ఇందులో కొంత నిజం ఉంది, కొంత అబద్దం ఉంది.కుక్కలకు కాస్త అదనపు దృష్టి ఉండటంతో పాటు, వాసన పసికట్టే గుణం కూడా ఉంటుంది.దాంతో ఆ కుక్కలు కొత్త వాటిని ఏమైనా చూస్తే వెంటనే మెరుగుతాయి.అలా అని అవి దెయ్యాలను గుర్తు పడుతాయని అర్థం కాదు.

దెయ్యాలను కుక్కలు గుర్తు పట్టడం అనేది మూడ నమ్మకం కాని, ప్రత్యేకమైన వాటి దృష్టి మరియు వాసన పట్టే గుణం వల్ల ప్రమాదం లేదా విపత్తును గుర్తిస్తాయి.

కుక్కలకు ఎక్కడో ఉండే శబ్దాలు కూడా వినిపిస్తాయి.కిలోమీటర్ల దూరంలో ఉండే ఆపద శబ్దంను కుక్కలు పసిగడుతాయట.కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన సునామికి సంబంధించిన హెచ్చరికలు నిమిషాల ముందు కుక్కలు చేశాయట.

అయితే కుక్కలను ఎవరు పట్టించుకోలేదు.నిమిషాల్లో ఉప్పెన రాబోతుందని కుక్కలు గుర్తించాయి అంటే వాటిని శబ్దంను వినే శక్తి ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

కుక్కలు దొంగలు, ఎవరైనా కొత్త వారు వస్తే మొరుగుతాయి.అంతే తప్ప ఇప్పటి వరకు దెయ్యాలను కుక్కలు పట్టించిన దాఖలాలు అయితే లేవు.అలా అని దెయ్యాలు లేవు, ఉన్నాయి అని మాత్రం మేము చెప్పడం లేదు.దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది అనేది కొందరి వాదన, దేవుడు మాత్రమే ఉన్నాడు, దెయ్యం లేదు అనేది కొందరి వాదన.

మరి ఈ రెండు వాదనలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి.ఉన్నాడో లేదో తేలియని దెయ్యాలను కుక్కలు గుర్తించాయని వాదించడం సబబు కాదు.

కాని కుక్కలకు ప్రత్యేకమైన శక్తులు ఉన్నట్లుగా నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube