తెలంగాణా రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థతి నెలకొంది.ఊహకి కూడా అందని ట్విస్ట్ లు , ఏ సినిమాల్లో కూడా చూడని సస్పెన్స్ లు రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ తెరలపై చూడబోతున్నాము అనేది వాస్తవం.
ఏ పార్టీ నేత ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తాడో ఊహకి కూడా అందటం లేదు.గంట క్రితం టీఆర్ఎస్ పార్టీ కి మద్దతుగా ప్రతిపక్షాలని ఏకేసే నాయకుడు మరొక గంటలో అదే ప్రతిపక్ష పార్టీ తీర్ధం పుచ్చుకుని కనపడుతాడు.
సరే ఈ విషయం పక్కన పెడితే తెలంగాణా రాజకీయ వర్గాలూ జోరుగా వినిపిస్తున్న మరొక వార్తా ఏమిటింటే.
ముందస్తు ఎన్నికల పుణ్యమా కేసీఆర్ ని ఓడించే ప్రయత్నంలో టీఆర్ఎస్ ,బీజేపీ మినహా అన్ని పార్టీలు కాంగ్రెస్ సారధ్యంలో కూటమి కట్టాయి అయితే ఈ కూటమి వలన తెలంగాణ ప్రజలకి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు కూటమి నేతలు.అదేంటంటే.ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కూటమీ తరుపున ప్రచారానికి టాలీవుడ్ స్టార్స్ కదిలి రానున్నారట.
.ఇంతకీ వారెవరో కాదు టీడీపీ తరుపున ఇప్పటికే తెలంగాణలో ఖమ్మం జిల్లా పర్యటనలో దుమ్ము రేపేసిన బాలయ్య బాబు ఒకరైతే కాంగ్రెస్ పార్టీ నుంచీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మెగాస్టార్ చిరు ఒకరు అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ నుంచీ కాంగ్రెస్ లోకి చేరిక విజయశాంతి మరోకరు.
ఈ జంటలు తెలుగు సినిమా చరిత్రలోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాయి.మరి ఇప్పుడు పొత్తుల కూటమిలో వీరు ముగ్గురు ఒకే వర్గంగా ఏర్పడ్డారు…ఈ ముగ్గురూ కలిసి గనుకా ప్రచారం చేస్తే ఆ ప్రభావం మాత్రం తెలంగాణా ఎన్నికల్లో భారీగా ఉంటుదని అంచనా వేస్తున్నారు.అయితే ఈ స్టార్ క్యాంపెయిన్ లోకి బాలయ్య, విజయశాంతి ఒకే చెప్పగా చిరు ఇంకా ఒకే చెప్పాల్సి ఉంటుంది.తెలంగాణలో మహాకూటమి పురుడుపోసుకున్నాక కాంగ్రెస్-టీడీపీ కలిసిపోయాయి.ఇప్పుడీ వైరపక్షాలు కలిసి పోటీ ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యాయి.ఇప్పటికే కాంగ్రెస్ తరఫున విజయశాంతి ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు.