ఎప్పడూ లేనటువంటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయి.రాబోయే రోజుల్లో ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
నాలుగు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో తలపడనున్నాయి.అలాగే ఎన్నికల సమయం కూడా సమీపిస్తుండడంతో జనాల్లో చొచ్చుకెళ్లేందుకు అన్ని పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి.
ఈ దశలో ఇప్పడు అధికార పార్టీ తెలుగుదేశాన్ని రెండు పార్టీలు కంగారు పెట్టిస్తున్నాయి.ఒక వైపు వైసీపీ మరోవైపు జనసేన అధినేతలు ఇద్దరూ జనం నాది పట్టి వాటిని ఓట్లుగా మలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అదే సమయంలో టీడీపీ పై అవినీతి విమర్శలు బలంగా చేస్తుండడంతో ఆ పార్టీ కలవరపెడుతోంది

వైసీపీ అధినేత చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో టీడీపీని విమర్శించడంతో పాటు ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ .వాటి గురించి ప్రభుత్వాన్ని జనం మధ్యనే నిలదీస్తూ .విమర్శించడంతో ప్రజల నుంచి విపరీతమైన స్పందన కనిపిస్తోంది.దీంతో అటు ప్రజల్లోనూ.
ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ మంచి జోష్ కనిపిస్తోంది ఆ పార్టీకి.పనిలో పనిగా అదే సమయంలో ఎక్కడికక్కడ పార్టీలో చేరికలు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
పాదయాత్ర ముగిసేనాటికి భారీ స్థాయిలో చేరికలు ఉండేలా చూసుకుంటున్నాడు
ఇక జనసేన అధినేత పవన్ విషయానికి వస్తే… నాలుగేళ్లుగా టీడీపీతో అంటకాగి .ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ సడెన్ గా ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండడంతో టీడీపీ తట్టుకోలేకపోతోంది.ఏపీలో వెనుకబడిన జిల్లాగా గుర్తింపు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో పవన్ ఇప్పుడు పర్యటిస్తూ.ప్రభుత్వాన్ని ఏకేస్తున్నాడు.స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే వాటిని పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తూ టీడీపీ పరువు పోగొట్టేలా పవన్ ప్రవర్తిస్తున్నాడు
ఒక వైపు జగన్ మరో వైపు పవన్ ఇలా ఎవరికీ వారు ప్రభుత్వాన్ని ఆడేసుకోవడంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడిపోయాడు.పైకి గంబీరంగా ఉన్నట్టు … వీళ్ళు చేస్తున్న యాత్రలు గురించి పట్టించుకోనట్టు కలరింగ్ ఇస్తున్న బాబు వాస్తవానికి వీరిద్దరి యాత్రలపై తీవ్రంగానే కలవరం చెందుతున్నట్టు తెలుస్తోంది.