పరీక్షల్లో ఫెయిల్ అయిన కొడుకు ! ఆ తండ్రి చేసిన పని చూస్తే అందరూ షాక్

తల్లిదండ్రుల పెంపకం పైనే పిల్లల ప్రవర్తన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది , ఒకప్పుడు పిల్లలు తప్పు చేస్తే వల్ల తల్లిదండ్రులు దండించేవాళ్ళు దానితో పిల్లలు మళ్ళీ ఆ తప్పుని చేసేవారు కాదు కాని ఇప్పుడు ఉన్న కాలం లో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తల్లిదండ్రులు ఏమి అనలేకపోతున్నారు ఏమైనా అంటే మనస్తాపం తో చేయారనిది చేసుకుంటారేమో అని భయపడుతున్నారు.అలా అని పిల్లలు ఏది చేసినా సమర్థిస్తూ వెళ్తుంటే వారు చెడు దారిలో వెళ్లేలా తయారు చేసిన వాళ్ళం అవుతాం

 Father Throws Party After Son Fails Exam-TeluguStop.com

అయితే ఇటీవల మధ్యప్రదేశ్ లో భోపాల్ లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.సురేందర్ కుమార్ అనే ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ కొడుకు ఆషు ఈ మధ్య జరిగిన మధ్యప్రదేశ్ బోర్డ్ నిర్వహించిన 10 వ తరగతి పరీక్ష రాసాడు , వారి ఫలితాలు గత వారమే వచ్చాయి అయితే ఆషు రెండు సబ్జెక్ట్ లలో తప్పడు, భయం తో ఇంటికి వెళ్లిన ఆషు ని తన తండ్రి సురేందర్ ఏమి అనలేదు పైగా నవ్వుతూ స్పందించాడు.ఇందులో ఏమి ఉంది అనుకుంటున్నారు కదూ అసలు ఇక్కడే అసలు కథ మరుసటి రోజే సురేందర్ కుమార్ పరిసరాల్లో ఉన్న వారిని మరియు చుట్టాలను పిలిచి ఘనంగా పార్టీ ఇచ్చారు అక్కడ ఉన్న ప్రజలు అందరు తన కుమారుడు పరీక్షలో మంచి మార్క్ లు సంపాదించడాని పార్టీ అనుకోని వెళ్లారు తీరా చూస్తే తన కొడుకు పరీక్ష తప్పినందుకు పార్టీ ఇస్తున్న అందరూ సంతోషంగా పార్టీ ని ఎంజాయ్ చేయండి అని చెప్పాడు , దానితో అక్కడ ఉన్న జనాలు అందరూ షాక్ అయ్యారు.

మా అబ్బాయి పరీక్షల కోసం 2 నెలల నుండి కష్టపడి చదివాడు కానీ ఫలితాలు వేరేగా వచ్చాయి అని చెప్పాడు

జీవితం లో ఫలితాలు మాత్రమే అంత ముఖ్యం కాదు దానికోసం మనం పడే కష్టం మరియు దాని గురించి ఆలోచన ముఖ్యమే.పరీక్షల కన్నా మా అబ్బాయి జీవితం లో సాదించవలిసిన వి చాలా ఉన్నాయి మా అబ్బాయి పరీక్షల్లో తప్పడు ఆ ఫలితాలు చూసుకొని మనస్తాపానికి గురై చెంది ఏదైనా చేసుకుంటే నేను తట్టుకునేవాన్ని కాదు , ఈ మధ్య చాలా మంది విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు వారు తల్లిదండ్రుల గురించి ఆలోచించడం లేదు, కానీ నా కొడుకు అలా ఆలోచించలేదు పరీక్ష ఫెయిల్ అయితేనేం నా కొడుకు నాతోనే ఉన్నాడు నాకు అది చాలు.

ఈ సంవత్సరం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ వచ్చే సంవత్సరం తప్పక పాస్ అవుతాడని నమ్మకం నాకు ఉంది , తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు మరియు పరీక్ష తప్పిన విద్యార్థులకు నేను చెప్పాలనుకుంటున్నది ఇదే మీ చివరి పరీక్ష కాదు జీవితం లో ఏన్నో పరీక్షలు వస్తాయి అన్నిటిని ఎదురుకొని జీవించాలి.ఈ సంవత్సరం కాకుంటే మరో సంవత్సరం ఈ పరీక్ష కాకుంటే మరో పరీక్ష జీవితం లో చాలా వస్తుంటాయి పోతుంటాయి అందుకే మా కొడుకు ఫెయిల్ అయినందుకు నేను పార్టీ ఇచ్చాను అని చెప్పాడు.

ఏది ఏమైనా ఇటువంటి వాటి వల్ల పిల్లలు ఒత్తిడికి గురై కాకుండా ఉండగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube