పవన్ - చరణ్ ల మధ్య గొడవపెడుతున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ లు ఎంత మంచి స్నేహితులు మనందరికీ తెలుసు.వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు కలిసి విదేశాలు కూడా చుట్టి వస్తూ ఉంటారు.

 Ram Charan To Clash Against Pawan Kalyan-TeluguStop.com

ఖాళీ సమయాల్లో కలుసుకుంటూ ఉంటారు.వీరు మాత్రమే కాదు వీరి భార్యలు నమ్రతా, ఉపాసన కూడా మంచి స్నేహితులు.

అన్నీ అనుకున్నట్లుగా సాగితే మహేష్ బాబు రామ్ చరణ్ కలిసి ఒక బిజినెస్ కూడా నడపాలని అనుకుంటున్నారు.అంత మాత్రమే కాదండోయ్, రాంచరణ్ నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా మనం ఒక సినిమాని కూడా రాబోయే సంవత్సరాల్లో ఆశించవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ల మధ్య గొడవకు మహేష్ బాబు ఎలా కారణం అవుతాడు అని ఆలోచిస్తూ ఉండవచ్చు మీరు.

మహేష్ బాబు స్పైడర్ చిత్రాన్ని పూర్తి చేసేశాడు.

ఆ సినిమాకి సంబంధించి డబ్బింగ్ పనులు కూడా పూర్తి కావచ్చాయి.సినిమా పూర్తిగా సిద్ధంగా ఉంది.

సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు భరత్ అనే నేను అనే సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు.కానీ అలా జరిగేలా లేదు.స్పైడర్ ఆలస్యం అవడం తో ఈ సినిమా కూడా ఆలస్యంగా ప్రారంభం అయ్యింది.దాంతో మహేష్ సంక్రాంతి కి వచ్చేది దాదాపుగా అసంభవం అనిపిస్తోంది.

దీనర్థం, సంక్రాంతి బరి లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు పోటీ పడటం లేదు ‌.

మరోవైపు చరణ్ సినిమా రంగస్థలం 1985 మొదట సంక్రాంతికే వద్దామనుకున్నా, రెండు పెద్ద సినిమాలు ఉండటంతో వెనకడుగు వేశారు.ఇప్పుడు భరత్ అనే నేను వాయిదా పడటంతో బాబాయి పవన్ కళ్యాణ్ కి పోటీ గా అబ్బాయి రామ్ చరణ్ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగిన దిగవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube