పవన్కళ్యాణ్ ఫుల్ టైం పొలిటిషీయన్గా మారడం సంగతేమో గాని జనసేన అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఆ పార్టీ క్రియేట్ చేసే సంచలనాల కోసం చాలా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.పవన్ ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ కార్యాచరణ ప్రారంభించకపోయినా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరి ఏర్పాట్లలో వాళ్లు ఉన్నారు.
చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో అందరికంటే ముందు ఉంటూ పవన్ దృష్టిలో పడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటోన్న ఆశావాహులు జనసేన ఆఫీస్లో బయోడేటాలు ఇస్తున్నారు.
ఇవన్నీ ఎలా ఉన్నా ఏపీలో జనసేన నుంచి పోటీ చేస్తారని కొందరు అభ్యర్థులు పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మూడు ఎంపీ స్థానాలకు జనసేన అభ్యర్థులు వీళ్లేనంటూ ఓ టాక్ ప్రచారంలో ఉంది.
ఈ మూడు ఎంపీ స్థానాల్లో కృష్ణా జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు జనసేన నుంచి అభ్యర్థుల పేర్లు కూడా తెరమీదకు రావడం విశేషం.
విజయవాడకు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేశినేని రాజేంద్రప్రసాద్ పేరు వినిపిస్తోంది.
బందరు నుంచి మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పేరు లైన్లో ఉంది.బాడిగను ఎంపీగా పోటీ చేయాలని పవన్ అభిమానులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక కాకినాడ నుంచి పవన్ సోదరుడు నాగబాబు పేరు వినిపిస్తోంది.
మరి ఈ ప్రచారం ఎలా ఉన్నా ? ఫైనల్గా పవన్ ఒంటరిగా పోటీ చేస్తాడా ? లేదా ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటాడా ? అన్నదానిపైనే ఈక్వేషన్లు మారనున్నాయి.