యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాంచి ఫామ్‌లో జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాడు.ఎన్టీఆర్ కెరీర్లోనే గతంలో ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు.
టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.ఇక ఇప్పుడు బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తూ బుల్లితెరను కూడా షేక్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ సినిమాకు అదిరిపోయే రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ సినిమా థియేటర్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.70 కోట్లకు అమ్ముడయ్యాయి.దీనికి తోడు జీఎస్డీ కూడా అదనం.
దసరా కానుకగా రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది.ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ గురించే జోరుగా డిస్కర్షన్లు నడుస్తున్నాయి.
ఈ సినిమా ఏరియాల వారీ రైట్స్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.
నైజాం – దిల్ రాజు ( 20 కోట్లు)సీడెడ్- గంగాధర్ అండ్ (13.5 కోట్లు )కృష్ణ, గుంటూరు – సుధాకర్ఈస్ట్ – భరత్ పిక్చర్స్ ( 6 కోట్లు)వెస్ట్ – ఉషా పిక్చర్స్నెల్లూరు – పవన్విశాఖ – రూ.9 కోట్లకు పెండింగ్‌లో ఉంది.