మొన్నటికి మొన్న, గుజరాత్ లోని ఓ జూలో ముగ్గురు మనిషుల్ని చంపిందని ఓ పులికి జీవితఖైదు విధించారు ఆ జూ సిబ్బంది.అలాంటి విచిత్రమే ఖమ్మంలో జరిగింది.
ఇక్కడ పులిని, సింహాన్ని కాకుండా ఒక కోడిపుంజుని అరెస్టు చేసి లాకప్ లో వేశారు పోలీసులు.కాని ఈ కోడిపుంజు ఏ మనిషిని చంపలేదు.
కనీసం గాయపర్చలేదు.అయినా లాకప్ లో వేసారు.
వినడానికి విచిత్రంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు ఖమ్మం వాసులని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విషయంలోకి వెళ్తే, ఆదివారం సాయంత్రంపూట నగరంలోని ఓ ప్రాంతంలో కోడిపుంజుల కొట్లాట మొదలైంది.
తెలిసిందేగా .ఇలాంటి ఆటలకు పర్మిషన్ లేదని.సమాచారం అందగానే పోలీసులు వెంటనే అక్కడికి బయలుదేరారు.కాని అప్పటికే పోలీసులు వస్తున్న విషయాన్ని తెలుసుకోని పందెంరాయుళ్ళు అక్కడినుంచి జంప్ అయిపోయారు.తప్పించుకున్న పందెంరాయుళ్ళని పట్టలేక, అక్కడే ఉన్న కోడిపుంజుని తమవెంట పట్టుకుపోయారు పోలీసులు.
తీసుకెళ్ళి వండుకోని తిన్నారా అంటే లేదు.
దాదాపుగా ఒక రోజంతా కోడిపుంజుని లాకప్ లో పెట్టేసారు.విషయం తెలుసుకున్న మీడియా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫోటోలు తీస్తుండటంతో, లాకప్ నుంచి కోడిపుంజుని బయటకితీసి, అక్కడే బయట కట్టేసారు.
అయితే ఇంతవరకు పందెంరాయుళ్ళ జాడ దొరకలేదట.