కోలీవుడ్లో ఓ లక్కీ ఆఫర్ సమంత కాలదన్నుకుంది.వెట్రిమారన్ డైరక్షన్లో వడచెన్నై సినిమాలో ధనుష్ కు జతగా సెలెక్ట్ అయిన సమంత ఆ సినిమా తాను చేయలేనని చెప్పేసిందట.
ఇందుకు కారణం సమంత నాగచైతన్యల ప్రేమే కారణం అంటున్నారు.త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇక సాధ్యమైనంత వరకు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందట సమంత.
ప్రస్తుతం జనతా గ్యారేజ్ ఒక్కటి మాత్రమే చేస్తున్న సమంత నాగ చైతన్యతోనే సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి.
మరి ఇంత హంగామా జరుగుతున్నా సరే చైతు, సమంతల్లో ఎవరు ఈ విషయాన్ని మాత్రం ఓపెన్ గా చెప్పట్లేదు.
ఇకపోతే సమంత మిస్ చేసుకున్న వడచెన్నై ఆఫర్ ను అమలా పాల్ చెంత చేరింది.తెలుగు తమిళ భాషల్లో క్రేజీ బ్యూటీగా ఇమేజ్ సంపాదించుకున్న అమలా పాల్ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాల్లో నటిస్తుంది.
మరి లక్కీ ఆఫర్ చేజిక్కించుకున్న అమలా ఆ సినిమాతో ఎలాంటి హిట్ దక్కించుకుంటుందో చూద్దాం.