బాబోయ్‌.. 150 పంది పిల్లలను ఎందుకు పెంచావ్‌ రవిబాబు..   Ravi Babu Starts A Pig Farm For Adhugo     2018-09-10   09:46:08  IST  Ramesh P

విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు గత రెండు సంవత్సరాలుగా ‘అదుగో’ చిత్రంతో కుస్తీ పడుతున్నాడు. పంది పిల్లతో ఒక చిత్రాన్ని చేస్తున్నాను అంటూ ప్రకటించిన రవిబాబు కొన్నాళ్లు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత పంది పిల్లతో అప్పుడప్పుడు బయటకు కనిపించిన రవిబాబు తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించాడు. దసరాకు విడుదల కాబోతున్న ‘అదుగో’ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను చెబుతూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు.

ఇటీవలే రవిబాబు తన సినిమా టీజర్‌ను విడుదల చేశాడు. కేవలం పంది పిల్లను మాత్రమే చూపించి, నవ్వించిన ఈ దర్శకుడు త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇక రవిబాబు ఈ చిత్రం కోసం పంది పిల్లను పెంచినట్లుగా మొదటి నుండి వార్తలు వచ్చాయి, ఆ విషయాన్ని ఆయన కూడా చెప్పుకొచ్చాడు. తాజాగా రవిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏకంగా 150 పంది పిల్లలను తాను పెంచినట్లుగా పేర్కొన్నాడు.

‘అదుగో’ ప్రమోన్‌లో భాగంగా రవిబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట తాను ఒక పంది పిల్లతో షూటింగ్‌ ప్రారంభించాను. షూటింగ్‌ నెమ్మదిగా జరుగుతుండగా ఆ పంది పిల్ల మాత్రం బరువు పెరిగి పోయింది. మూడు నెలల్లోనే ఆ పిల్ల రూపం మారిపోయింది. దాంతో తాను మరో పంది పిల్లను తీసుకు వచ్చాను. అలా ఒకదానికి తర్వాత ఒకటి అన్నట్లుగా ఏకంగా 150 పంది పిల్లలను తీసుకు వచ్చి పెంచాను. అన్ని ఒకేలా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా రవిబాబు పేర్కొన్నాడు.

Ravi Babu Starts A Pig Farm For Adhugo-

సహజంగా సెలబ్రెటీలు కుక్క పిల్లలు లేదంటే పిల్లి పిల్లలను పెంచుకుంటాడు. కాని రవిబాబు మాత్రం విభిన్నంకు మారు పేరు కనుక తన సినిమా కోసం పంది పిల్లలను పెంచుకుని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సినిమా మేకింగ్‌ విషయంలోనే సంచలనం సృష్టించిన రవిబాబు సినిమా విడుదలైన తర్వాత మరెంతగా ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.