భారతదేశంలో 70% సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్ట్స్‌ దక్షిణ భారతదేశంలోనే...

న్యూఢిల్లీ, 08 ఫిబ్రవరి 2022 ః భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వయోవృద్ధుల కారణంగా రాబోయే మూడు దశాబ్దాలలో రిటైర్‌మెంట్‌ గృహాలకు సైతం అదే స్ధాయి డిమాండ్‌ పెరిగి సీనియర్‌ లివింగ్‌ హౌసింగ్‌ అనేది అతి ముఖ్యమైన రెసిడెన్షియల్‌ ఆస్తి విభాగంగా మారే అవకాశాలున్నాయని హౌసింగ్‌ డాట్‌ కామ్‌ అధ్యయనం వెల్లడించింది.సీనియర్‌ లివింగ్‌ హౌసింగ్‌ అనేది ప్రస్తుతం ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా వెలుగులోకి రావడంతో పాటుగా పెద్ద వయసు వారి బలహీనతను ప్రధానంగా వెల్లడించింది.

 India's Ageing Population, Covid Health Pandemic To Spur Growth In Nascent Senio-TeluguStop.com

ఈ విభాగంలో ఉన్న అసాధారణ అవకాశాలను గుర్తించిన ఎంతోమంది రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు ఈ డిమాండ్‌ను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో పాటుగా స్టాండలోన్‌ సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం లేదా అవసరమైన సదుపాయాలతో పూర్తిగా అంకితం చేసిన టవర్లను నిర్మించడం ప్రారంభిచారు.

‘‘భారతదేశపు 130 కోట్ల జనాభా గతానికన్నా వేగంగా వయసు భారంతో కృంగిపోతుంది.

సీనియర్‌ సిటిజన్స్‌ (60 సంవత్సరాలకు పైబడిన వయసు కలిగిన వారు ) 2020–2050 సంవత్సరాల నడుమ 130% వృద్ధి చెందవచ్చని అంచనా వేయబడుతుంది.అంతేకాదు ప్రస్తుతం ఉన్న 139 మిలియన్ల నుంచి 320 మిలియన్‌లకు వీరి సంఖ్య చేరవచ్చు’’ అని ధృవ్‌అగర్వాల, గ్రూప్‌ సీఈవో, హౌసింగ్‌డాట్‌కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.

అగర్వాల అభిప్రాయం ప్రకారం భారీగా పెట్టుబడులు పెట్టగలిగిన ఈ వయసు వారు అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు అధికంగానే ఉన్నాయి.

‘‘కో వర్కింగ్‌ మరియు కో లివింగ్‌ లాగానే భారతదేశపు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఓ ప్రత్యేక ఆస్తి తరగతిగా సీనియర్‌ లివింగ్‌ అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయి’’ అని అగర్వాల అన్నారు.

ప్రస్తుత స్ధితి :

హౌసింగ్‌ డాట్‌ కామ్‌ యొక్క నివేదిక ‘ద సిల్వర్‌ ఎకనమీ – ఏ పర్‌స్పెక్టివ్‌ ఆఫ్‌ సీనియర్‌ లివింగ్‌ ఇన్‌ ఇండియా’లో సీనియర్‌ లివింగ్‌ హౌస్‌ లేదా రిటైర్‌మెంట్‌ గృహాలకు మూలం రెండు దశాబ్దాల క్రితమే ఏర్పడింది.అయితే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నూతన ఆస్ధి తరగతిఆ మారేందుకు ఇది ఇంకా ఎంతోదూరం వెళ్లాల్సి ఉంది.
ప్రస్తుత అధ్యయనం ప్రకారం, భారతదేశంలో దక్షిణాది నగరాలు భారతదేశపు సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్ట్‌లలో 70% వాటా ఆక్రమిస్తున్నాయి.భౌగోళికంగా అధిక శాతం సీనియర్‌ లివింగ్‌ ప్రాజక్టులు బెంగళూరు, చెనై, కొచి, కోయంబత్తూరులలో ఉండగా అనుసరించి పశ్చిమ, ఉత్తర భారతదేశ నగరాలు ఉన్నాయి.

ఆహ్లాదకరమైన వాతావరణం, అత్యుత్తమ కనెక్టివిటీ, సుప్రసిద్ధ ఆరోగ్య కేంద్రాలు ఉండటం కూడా సీనియర్‌ లివింగ్‌ కేంద్రాలను నిర్వహించడానికి దక్షిణ భారతదేశాన్ని అత్యంత అనువైన ప్రాంతంగా మార్చింది.

ఈ నివేదిక గురించి కొలంబియా పసిఫిక్‌ కమ్యూనిటీస్‌ సీఈఓ మోహిత్‌ నిరులా మాట్లాడుతూ ‘‘దేశపు అతిపెద్ద మరియు ప్రాధాన్యతా మరియు ఒకే ఒక్క అంతర్జాతీయ ప్లేయర్‌గా భారతదేశంలో సీనియర్‌ లివింగ్‌ కమ్యూనిటీలకు సేవలనందిస్తున్నామంటూ 2022 సంవత్సరం ఈ విభాగానికి బ్రేకవుట్‌ ఇయర్‌గా నిలుస్తుందన్నారు.

అషియానా హౌసింగ్‌ లిమిటెడ్‌ జెఎండీ అంకుర్‌ గుప్తా మాట్లాడుతూ దేశంలో మెట్రోలు, చిన్న నగరాలలో సీనియర్‌ లివింగ్‌ కమ్యూనిటీలు వృద్ధి చెందనున్నాయని అభిప్రాయపడ్డారు.రాబోయే సంవత్సరాలలో సేవలు, వసతుల పరంగా వీరి అవసరాలకు ప్రాధాన్యత ఏర్పడనుందన్నారు.

అయితే డెవలపర్లు ఈ ప్రాజెక్టులు మరింత అనుకూలంగా, వినియోగదారుల కోణంలో అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.నాణ్యమైన ప్రాజెక్టులకు రూపకల్పన చేయడంతో పాటుగా ప్రీమియం కమ్యూనిటీ లివింగ్‌ అనుభవాలను జోడించాల్సి ఉందన్నారు.

మ్యాక్స్‌ ఇండియా ఎండీ మరియు అంతారా సీనియర్‌ కేర్‌ ఎండీ అండ్‌ సీఈఓ రజిత్‌ మెహతా మాట్లాడుతూ ువృద్దుల సంక్షేమం కోసం సమగ్రమైన సదుపాయాలు అందించాల్సి ఉందన్నారు.నిర్మాణాత్మక కేర్‌ ప్రోగ్రామ్‌లు, లక్ష్యిత విధానాలు, ప్రత్యేక వైద్య సేవలు, సీనియర్‌ ఫ్రెండ్లీ ఆర్కిటెక్చర్‌, ఉండాల్సి ఉందన్నారు.

వైవిధ్యమైన నమూనాలు :

రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టులను విక్రయాలు లేదా లీజు పద్ధతిలో అందిస్తున్నారు.సీనియర్‌ లివింగ్‌ హౌసింగ్‌ విభిన్న నమూనాల్లో లభిస్తుంది.

ఇండిపెండెంట్‌ లివింగ్‌, అసిస్టెడ్‌ లివింగ్‌, స్కిల్డ్‌ లేదా నర్సింగ్‌ కేర్‌, కంటిన్యూయింగ్‌ కేర్‌ రిటైర్‌మెంట్‌కమ్యూనిటీ ఉన్నాయి.

బిల్డర్లు ఇప్పుడు ఇంటి సేవలు, రిక్రియేషనల్‌ సదుపాయాలు, కమ్యూనిటీ ప్రాంగణాలు అందిస్తున్నారు.

ఈ తరహా సదుపాయాలలో అంబులెన్స్‌లు, రెగ్యులర్‌ మెడికల్‌ చెకప్స్‌, హాస్పిటల్స్‌తో ఒప్పందాలు వంటివి సైతం ఉంటాయి

కీలకడిమాండ్‌ చోధకాలు :

వృద్ధి చెందుతున్న వృద్ధ తరం, పెరుగుతున్న న్యూక్లియర్‌ ఫ్యామిలీలు, విద్యావంతులైన సీనియర్‌ సిటిజన్లు, పెద్దల వైద్యావసరాలు పెరగడం వంటివి ఉన్నాయి.హౌసింగ్‌ డాట్‌ కామ్‌ నివేదికలు వెల్లడించే దాని ప్రకారం సీనియర్‌ సిటిజన్లు ఇప్పుడు 1–2 కోట్ల రూపాయల శ్రేణి గృహాల కోసం వెదుకుతున్నారు.

అయితే 45 లక్షల రూపాయల లోపు 2బీహెచ్‌కెలకు డిమాండ్‌ ఇప్పటికీ అధికంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube