ఈ మధ్య కాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి ప్రేమ, పెళ్ళి వంటి బంధాలను అపహాస్యం చేస్తున్నారు.అయితే ఓ వ్యక్తి 49 ఏళ్ల వయసులో తోడు కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటే చివరికి వధువు తరపు బంధువులు అతడి నుంచి దాదాపు ఆరు లక్షల రూపాయలు మోసం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఒక స్థానిక రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో 49 సంవత్సరాలు కలిగిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఆ మధ్య ఈ వ్యక్తి భార్య అనారోగ్య సమస్యల కారణంగా కన్ను మూయడంతో వృద్ధాప్యంలో తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
ఈ క్రమంలో పేదరికంలో ఉన్న అమ్మాయి అయినా సరే వారి కష్టాలు తీర్చి సహాయం చేసి తనకు తగ్గ వధువుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.దీంతో తన పూర్తి వివరాలను ఆన్ లైన్ లోని మ్యారేజ్ బ్యూరో లో పొందుపరిచి తనకు సరైన జోడి కోసం వెతుకుతున్నాడు.
ఈ క్రమంలో తెనాలి కి చెందిన ఓ వ్యక్తి పెళ్లిళ్ల పేరయ్య అని పరిచయం చేసుకుంటూ కొంతమంది యువతుల ఫోటోలు పంపించాడు.దీంతో ఈ వ్యక్తి కి ఓ యువతి నచ్చడంతో పెళ్లి చేసుకుంటానని తెలియజేశాడు.
దాంతో ఇదే అదునుగా చేసుకున్న పెళ్ళిళ్ళ పేరయ్య తాను ఎంచుకున్న యువతికి కొంతమేర ఆర్థికంగా కష్టాలు ఉన్నాయని కాబట్టి వాటిని తీర్చితే వధువు కుటుంబ సభ్యులతో మాట్లాడి తాను పెళ్లి సంబంధం కుదురుస్తానని అందుకుగాను 6 లక్షల రూపాయలు అవసరం అవుతుందని చెప్పడంతో వరుడు ఏ మాత్రం ఆలోచించకుండా డబ్బులు పంపించాడు.ఇంకేముంది తర్వాత ఏం జరిగిందో మీకు ఈ పాటికే అర్ధం అయి ఉంటుంది.
డబ్బులు పెళ్ళిళ్ళ పేరయ్య ఖాతా కి జమ చేసినప్పటి నుంచి అతడి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయింది.దీంతో వృద్ధుడు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుని పెళ్లిళ్ల పేరయ్య ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొందరు కేటుగాళ్లు ఆన్ లైన్ లో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులకు ఎలాంటి సమాచారం లేకుండా డబ్బు పంపించడం తీసుకోవడం వంటివి చేయవద్దని సూచిస్తున్నారు.