ఎన్ని ఓటీటీలు ఉన్నా యూట్యూబ్ ప్రత్యేకత యూట్యూబ్ కు ఉంది.యూట్యూబ్ లో వీడియోలు ఫ్రీగా చూసే అవకాశం ఉండటంతో పాటు ఎక్కువ సంఖ్యలో వినోదానికి సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉండటంతో యూట్యుబ్ లో వీడియోలను వీక్షించే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరగడం వల్ల కూడా యూట్యూబ్ యూజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.
యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న పాటల జాబితాను పరిశీలిస్తే పుష్ప ది రైజ్ మూవీలోని శ్రీవల్లి సాంగ్ 600 మిలియన్ వ్యూస్ తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడం వల్ల ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.అరబిక్ కుత్తు లిరికల్ వీడియో రెండో స్థానంలో నిలవగా బీస్ట్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం గమనార్హం.
పుష్ప సినిమాలోని సామి సామి సాంగ్ మూడో స్థానంలో నిలవగా కచ్చా బాదం సాంగ్ నాలుగో స్థానంలో నిలిచింది.
లే లే ఆయీ కోకకోలా సాంగ్ ఐదో స్థానంలో నిలవగా పుష్ప హిందీ వెర్షన్ లోని ఊ బోల్ గయా ఊహూ బోల్ గయా సాంగ్ ఆరో స్థానంలో నిలిచింది.ఊ అంటావా మావ సాంగ్ ఏడో స్థానంలో నిలవగా కోక్ స్టూడియో సాంగ్ ఎనిమిదో స్థానంలో ఉంది.అరబిక్ కుత్తు వీడియో సాంగ్ తొమ్మిదో స్థానంలో ఉండగా కేసరి లాల్ న్యూ సాంగ్ పదో స్థానంలో ఉంది.
పుష్ప ది రైజ్ సినిమాకు సంబంధించిన 4 పాటలు టాప్ 10లో ఉండటంతో బన్నీ అభిమానులు సంతోషిస్తున్నారు.బన్నీ క్రేజ్ కు ఇదే నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.పుష్ప ది రైజ్ విడుదలై దాదాపుగా ఏడాది అవుతున్నా ఈ సినిమా సాంగ్స్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.