Balakrishna Anil Ravipudi: బాలయ్య అనిల్ రావిపూడి మూవీ బిగ్ అప్డేట్‌ కి ముహూర్తం ఖరారు

నందమూరి బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.వచ్చే నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఖచ్చితం గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 Balakrishna 108 Movie Title Update Details, Anil Ravipudi, Balakrishna, Nbk 108-TeluguStop.com

ఇక బాలకృష్ణ తదుపరి సినిమా ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వం లో కన్ఫర్మ్ అయింది.షూటింగ్ కార్యక్రమాలు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రకటించారు.

ఈ సమయం లోనే ఈ సినిమా యొక్క టైటిల్ ని ప్రకటించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధమయ్యాడు.రేపు ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్లుగా అనిల్ రావిపూడి స్నేహితుల ద్వారా తెలుస్తోంది.

బాలయ్య ఫ్యాన్స్ మరియు తెలుగు సినిమా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గురించి ఎదురు చూస్తున్నారు.దర్శకుడు అనిల్ రావిపూడి తన యొక్క అన్ని సినిమా లకు విభిన్నమైన టైటిల్స్ ని ఖరారు చేయడం మనం చూస్తూ ఉన్నాం.

Telugu Anil Ravipudi, Balakrishna, Balakrishnaanil, Balakrishna Nbk, Nbk, Veera

కనుక ఈ సినిమా యొక్క టైటిల్ కూడా తప్పకుండా విభిన్నంగా ఉంటుంది అని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చివరి దశ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట.అంతే కాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా భారీ సెట్టింగ్స్ కూడా నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమా ను విడుదల చేసే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి చాలా స్పీడ్ గా సినిమా ను పూర్తి చేసే ఉద్దేశం తో ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

బాలయ్య సినిమా పై అంచనాలు ాకాశాన్ని తాకేలా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube