Cm jagan YSRCP : హలో... జనాల్లో తిరుగుతున్నారా లేదా ?

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా.సాధారణ ఎన్నికలు వచ్చినా, మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా జగన్ తమ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేస్తున్నారు.

 Cm Jagan Meeting With Mlas , Ysrcp, Ap Government, Cbn, Chandrababu,janasena, B-TeluguStop.com

ఈ విషయంలో జగన్ ఎక్కడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.పార్టీ నాయకులు అందర్నీ యాక్టివ్ చేస్తున్నారు.

నిత్యం జనాల్లో ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు.జగన్ సైతం గతంలో మాదిరిగా తమ కార్యాలయానికి పరిమితం కావడం లేదు.

నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేపడుతున్నారు.

పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి జగన్ వెళ్ళిపోయారు.ఇప్పటికే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రక్షాళన మొదలుపెట్టారు.

రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా చేసి వారిని రాజకీయంగా మరింత పతనం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారు.

      దీనిలో భాగంగానే ప్రజలు మద్దతు మరింత కూడకట్టేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించి , మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర నాయకులు , అధికారులు ఇలా అంతా జనాల్లోకి వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాల గురించి రాబోయే రోజుల్లో వైసిపి ప్రభుత్వం వల్ల జరగబోయే మేలు గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని , ప్రతి గడపను దర్శించి ప్రజలు మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా,  చాలామంది ఎమ్మెల్యేలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండలంపై జగన్ ఇప్పటికే సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు.దీంతో పాటు ఏ ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ?  ఎవరు అలసత్వంగా ఉంటున్నారనే విషయంపై వివిధ మార్గాల్లో ఆరా తీస్తున్నారు.పార్టీ నాయకులంతా జనాలు తిరగడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా.అది తగ్గుతుందని జగన్ అంచనా వేస్తున్నారు.
   

Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Ysrcp, Ysrcp Mlas-Political

  అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో అలసత్వం వహిస్తున్న కీలక నాయకులు అందరికీ నేరుగా జగన్ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్తున్నాయట.మీరు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోతే ముందు ముందు ఇబ్బంది పడతారని, టికెట్ దక్కే అవకాశం ఉండదని , పార్టీలోను ప్రాధాన్యం తగ్గిపోతుందని ఇలా ఎన్నో విధాలుగా వారిని భయపెడుతూ, బుజ్జగిస్తూ ఈ కార్యక్రమంలో యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంత ఆశక్తి లేని వారి విషయంలోనూ సీరియస్ గానే యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోందట.మరో రెండు రోజుల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి సమీక్ష సమావేశం జగన్ నిర్వహించబోతుండడంతో వైసీపీ ఎమ్మెల్యేలంతా టెన్షన్ పడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube