Pretends Road Accident Bangalore: వామ్మో, వీరు మామూలోళ్లు కాదు.. యాక్సిడెంట్ నాటకమాడి రూ.15,000 దోచేశారు!

ఈ రోజుల్లో రోడ్లపై అమాయకులను దోచేసే వారి సంఖ్య పెరుగుతుంది.వారే తమ వాహనంతో ఇతరుల వాహనాన్ని ఢీకొట్టేసి మళ్లీ వారే తప్పును ఇతరులపై తోసేసి డబ్బులు లాగేయటం ట్రెండ్‌గా మారుతోంది.

 2 Persons Who Pretended To Be Victims Of A Road Accident Extorted 15000 From The-TeluguStop.com

తాజాగా బెంగళూరులో కూడా ఇలాంటి మోసం చేస్తూ పోలీసులకు ఇద్దరు అడ్డంగా దొరికారు.బెంగుళూరు పోలీసులు శనివారం నాడు కారు యజమానితో యాక్సిడెంట్ నాటకమాడి డబ్బు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

ప్రమాదాల్లో బాధితులుగా నటిస్తూ డబ్బులు డిమాండ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు.అలాగే డ్రామా చేసిన వారికి సంబంధించిన ఒక వీడియో కూడా షేర్ చేశారు.

ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

వైరల్ వీడియోలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై తమ పక్కనే వెళ్తున్న కారును (చేతితో) కొట్టడం కనిపించింది.

తరువాత, వారు యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేశారు.ద్విచక్ర వాహనాన్ని డ్యాష్ చేసినందుకు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు.ఈ సంఘటన అక్టోబర్ 26న బెంగళూరులోని సిద్ధాపుర ప్రాంతంలో చోటుచేసుకుంది.బాధితురాలి నుంచి రూ.15వేలు ఇద్దరు వ్యక్తులు కాజేసినట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు యాక్సిడెంట్‌లో బాధితులుగా నటించి అసలైన బాధితుడి నుంచి రూ.15,000 దోపిడీ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం.నిందితులు బైక్‌పై ఉన్నారు.

వారు బాధితుడి కారును ఢీకొట్టి బెదిరించారు.అతని నుంచి రూ.15,000, 1 బైక్‌ను స్వాధీనం చేసుకున్నాం.అలాంటి సంఘటన ఏదైనా మీకు కనిపిస్తే దయచేసి పోలీసులకు తెలియజేయండి.” అని దక్షిణ బెంగళూరు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణకాంత్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube